Bigg Boss 4: వాయిస్ పెరిగితే ఒప్పుకోను.. ‘అమ్మ’ రాజశేఖర్‌పై దేవి ఫైర్

బిగ్‌బాస్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒకరైన దేవి నాగవల్లి ఎందుకో గానీ గత రెండు రోజులుగా ఇతర కంటెస్టెంట్‌లతో విభేదిస్తోంది

Bigg Boss 4: వాయిస్ పెరిగితే ఒప్పుకోను.. అమ్మ రాజశేఖర్‌పై దేవి ఫైర్

Updated on: Sep 19, 2020 | 8:17 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒకరైన దేవి నాగవల్లి ఎందుకో గానీ గత రెండు రోజులుగా ఇతర కంటెస్టెంట్‌లతో విభేదిస్తోంది. శుక్రవారం ఉదయం  మీరు చేసే ఫుడ్ తిననంటూ చెప్పేసిన దేవి, సెపరేట్‌గా ఫుడ్ తయారు చేసుకోవడం ప్రారంభించింది. నామినేషన్స్ తరువాత ఏదో జరిగిందని తనకు తెలుస్తోందని దేవి ఫీలైంది. అంతా కలిసి మాట్లాడుకుని తనను అవాయిడ్ చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయింది. ఈ విషయంలో లాస్య నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు.

ఇక నోయెల్‌ కెప్టెన్ అయిన తరువాత కూడా దేవి ఇష్యూ స్టార్ట్ చేసింది. మొదటి నుంచి కిచెన్‌ టీమ్‌లో ఉంటానని చెప్తున్న యాంకర్ దేవితో మోనాల్‌, కళ్యాణి, లాస్యలను టీమ్‌గా పెట్టారు నోయెల్‌. అయితే ఈ ఇష్యూలో రాజశేఖర్ మాస్టర్- దేవిల మధ్య డిస్కషన్ జరిగింది. తాను కిచెన్ టీంని ఎందుకు మార్చాలని చెబుతున్నానో దేవి వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్‌కు, దేవికి మధ్య క్లాష్ పెరిగింది. దీంతో వాయిస్ పెరిగితే ఒప్పుకోనంటూ అమ్మ రాజశేఖర్‌పై దేవి ఫైర్ అయింది. దానికి అమ్మ రాజశేఖర్ స్పందిస్తూ..  నువ్వు వాయిస్ పెంచి మాట్లాడొచ్చు. నేను పెంచకూడదా..? నువ్వు పెంచితే నేను కూడా పెంచుతా అంటూ రాజశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ అంత అయిపోయిన తరువాత కళ్యాణి మళ్లీ తన మాటలు మొదలుపెట్టింది. జీవితంలో ఇలాంటివి జరుగుతుంటాయి. గుణపాఠాలు నేర్చుకోవడానికే ఇక్కడకు వచ్చాం. ఎవరి మనస్తత్వాలు ఏంటన్నది బయటపడతాయి. కిచెన్ టీమ్‌కి సెలక్ట్ అయిన తరువాత కూడా ముఖాలు ముడుచుకొనిపెడుతున్నారని దేవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.

Read more:

ఏపీలో ఇవాళ్టి నుంచి రోడెక్కనున్న సిటీ బస్సులు

Bigg Boss 4: ఉన్నట్లుండి నోయల్‌కి ఏమైంది.. ఇవాళ నాగ్‌తో బయటపెడతాడా..!

Loading...
Unable to load recommendations.
Follow Us