Akhil Monal Date: బిగ్‌బాస్ లగ్జరీ టాస్క్‌లో భాగంగా మోనాల్‌తో డేటింగ్‌కి వెళ్లే అవకాశం అఖిల్‌కి వచ్చింది. ఈ టాస్క్ చేయలేనని అభిజిత్ చెప్పడంతో.. బిగ్‌బాస్, అఖిల్‌కి ఆఫర్ ఇచ్చాడు. ఇక అఖిల్‌తో డేట్ అనగానే.. చిరునవ్వులు చిందిస్తూ, మోనాల్ అందంగా ముస్తాబు అయ్యింది. ఇద్దరు కలిసి గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఈ క్రమంలోని తనలోని నటుడిని మళ్లీ నిద్రలేపిన అఖిల్.. ఆమెతో పులిహోర కలపడం ప్రారంభించారు. ఈ ఇద్దరు తమ తమ కారెక్టర్ ఏంటో చెప్పుకొచ్చారు. అయితే ఈ తరువాత నందికొండ వాగుల్లోనా అంటూ పాట రావడంతో ఇంటి సభ్యులంతా స్టెప్పులు వేస్తూ కనిపించారు. సొహైల్ షర్ట్ విప్పి చిందులేశాడు.