Bigg Boss 4: అఖిల్‌ని టార్గెట్‌ చేసిన ఆ జంట..!

| Edited By:

Oct 04, 2020 | 7:42 AM

బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాలుగో ఎలిమినేషన్‌ జరిగింది. గత వారం హౌజ్‌లోకి వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి ఈ వారం హౌజ్ నుంచి వచ్చేయనుంది

Bigg Boss 4: అఖిల్‌ని టార్గెట్‌ చేసిన ఆ జంట..!
Follow us on

Bigg Boss 4 Akhil: బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాలుగో ఎలిమినేషన్‌ జరిగింది. గత వారం హౌజ్‌లోకి వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి ఈ వారం హౌజ్ నుంచి వచ్చేయనుంది. ఇదిలా ఉంటే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతున్నట్లు నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. కాగా స్వాతి ఎలిమినేట్‌ అవ్వకముందే అభిజిత్‌, హారికలు వచ్చే వారం నామినేషన్లపై చర్చించారు.

ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. నన్ను మొహమాటం లేకుండా నామినేట్ చేసిన వాళ్లను నేను వదిలిపెట్టను అంటూ శపథం చేసింది. అయితే గతవారం అఖిల్, హారికను నామినేట్ చేయగా.. అతడిని నామినేట్ చేయబోతున్నట్లు ఇన్ డైరెక్ట్‌గా ఆమె చెప్పింది. మరోవైపు తాను కూడా అఖిల్‌నే నామినేట్ చేస్తా అని అభి అన్నాడు. నేను మోనాల్‌తో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడంటూ హారిక దగ్గర తన బాధను చెప్పుకున్నాడు అభిజిత్‌. మొదటి రెండు వారాలు బాగానే ఉన్నాడు కానీ తరువాతే మారిపోయాడని,  అతనితో అవసరం లేదని తెగ బాధపడింది హారిక. దీంతో హౌజ్‌లో జంటగా ఉంటున్న అభిజిత్, హారికలు అఖిల్‌ని నామినేట్ చేయడానికి డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది.

Read More:

Bigg Boss 4: స్వాతి దీక్షిత్‌ ఔట్‌.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్..!

ఉ. 9.30 నుంచి సివిల్స్ ప్రిలిమినరీ.. హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు