కోడలిగా మాకు హారిక ఓకే: అభిజిత్‌ తల్లిదండ్రులు

| Edited By:

Nov 11, 2020 | 9:35 AM

బిగ్‌బాస్‌ 4లోని ప్రేమ జంటల్లో అభిజిత్‌-హారిక జోడీ ఒకటి. హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో మోనాల్‌ కోసం తెగ ట్రై చేసిన అభిజిత్‌.. ఆ తరువాత హారికకు దగ్గరయ్యాడు.

కోడలిగా మాకు హారిక ఓకే: అభిజిత్‌ తల్లిదండ్రులు
Follow us on

Abhijeet parents on Harika: బిగ్‌బాస్‌ 4లోని ప్రేమ జంటల్లో అభిజిత్‌-హారిక జోడీ ఒకటి. హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో మోనాల్‌ కోసం తెగ ట్రై చేసిన అభిజిత్‌.. ఆ తరువాత హారికకు దగ్గరయ్యాడు. ఇక హారిక కూడా అభిపై చాలా ఇంట్రస్ట్‌ని చూపుతున్నట్లు బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లను చూస్తే అర్థమవుతుంటుంది. వీరిద్దరి పెయిర్‌ బిగ్‌బాస్ వీక్షకులకు కూడా బాగా నచ్చుతోంది. కాగా ఆ మధ్యన హౌజ్‌లో నుంచి ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్‌.. హారిక, అభి వద్ద రోజులో గంట సేపు మాత్రమే ఉంటుందని, వారిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని తెలిపింది. కానీ షోను చూసే వారికి మాత్రం అభి, హారిక మధ్య ఏదో నడుస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో వీరిద్దరు హగ్‌ల గురించి హద్దులు దాటి మాట్లాడుకున్నారు. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,196 కొత్త కేసులు.. 5 మరణాలు)

ఇదిలా ఉంటే తమకు కోడలిగా హారిక ఓకే అంటున్నారు అభిజిత్‌ తల్లిదండ్రులు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌజ్‌లో ఉన్న మోనాల్‌, అరియానా, హారికలలో మీరు కోడలిగా ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు.. వారు హారిక పేరును చెప్పారు. కాగా ప్రస్తుతం అభి సింగిల్ అని, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని తమకు మాట ఇచ్చాడని వారు తెలిపారు. ఎవరైనా తనకు సెట్‌ అయ్యే అమ్మాయిని చూడమని తమకు అభి చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ( Bigg Boss 4: అర్ధరాత్రి సూట్‌కేసులు సర్దుకున్న కంటెస్టెంట్‌లు.. ఏం జరగనుంది..!)