హారిక చేసింది తప్పుగా నేను అనుకోవడం లేదు.. అది కేవలం తన వయసు ప్రభావం.. హారిక తల్లి కూల్ రియాక్షన్
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది దేత్తడి హారిక. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో టాప్5లో కొనసాగడానికి హారిక గట్టిపోటి ఇస్తుంది.
Big Boss Season 4: సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది దేత్తడి హారిక. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో టాప్5లో కొనసాగడానికి హారిక గట్టిపోటి ఇస్తుంది. బయట కూడా హారికకు మద్దతుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్లలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో హారిక తల్లి, అన్నయ్య కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ సందర్భంలో హారిక తల్లి జ్యోతి.. తన జీవితంలో జరిగిన విషయాలను, భర్తకు దూరమై పిల్లలను కష్టపడి పెంచిన విషయాన్ని ఎమెషనల్‌గా షేర్ చేసుకున్నారు. “నాకు, నా భర్తకు మధ్య గొడవలు జరిగి విడిపోయాం. గతాన్ని గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు. పిల్లల కోసం కష్టపడింది మా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు తప్ప నా కళ్ళ ముందు ఎవరు ఏం అనుకున్నా తక్కువే అనిపిస్తుంది. నా పిల్లల్ని సెటిల్ చేయడానికి చాలా కష్టాలు, అవమానాలు భరించాను. టీచర్‌గా… ఐసీఐసీఐ బ్యాంకులో జాబ్ చేశా. నా కష్టం చూసి నా పిల్లలు ఏరోజు నన్ను బాధపెట్టలేదు. పెళ్ళి ఒక్కటే లైఫ్ కాదు. నా లైఫ్‌కి అంత ముఖ్యం అనుకోలేదు అందుకే జరిగిన దాన్ని వదిలేశాను.
బిగ్‌బాస్ వాళ్ళు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలిపారు. అయితే హారిక బ్రేకప్ లవ్ స్టోరీ గురించి తాను అడగాలని అనుకోవడం లేదు. ఎందుకంటే బ్రేకప్ అయిపోయిందని తనే చెప్పింది. ఒకవేళ ఏదైనా ఉంటే అబ్బాయి ఎలాంటి వాడు ఏంటీ? అని అడిగేదాన్ని. ఇప్పుడు అయిపోయినదాని గురించి అడగాలని అనుకోవడం లేదు. జరిగిపోయిన దాన్ని మరిచిపోవాలని నా లైఫ్‌ని బట్టి నేర్చుకున్నా.. ఈ విషయంలో నా దగ్గర నా కూతురు ఏదో దాచిందని అనుకోవడం లేదు. అది వయసు ప్రభావం.. ఆ వయసులో అలా ఉంటుంది. దాన్ని పెద్ద తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని నా దగ్గర ఆ విషయం దాచి ఉంటుంది. అంతకు మించి వేరే ఏం లేదు” అంటూ వివరణ ఇచ్చింది హారిక తల్లి.