Big Boss Season 4: టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మాటలు, తీసే సినిమాలు, చేతలు అన్ని చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఒకరిని ఫాలో అవడం తనకు నచ్చదని తనకంటూ ప్రత్యేక రూటు క్రియేట్ చేసుకున్నాడు ఈ సంచలన డైరెక్టర్. లాక్డౌన్ సమయంలోనూ వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ సంచలన డైరెక్టర్‌ను ఇంటర్వ్యూలు చేసినవారికి సూటిగా సమాధానాలు చెప్పడం వర్మకు అలవాటు. అప్పట్లో వర్మను ఇంటర్వ్యూ చేసిన అరియానాకు సూటీగా జవాబు ఇచ్చాడు. ఈ మధ్య మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపించింది అని అరియానా అడిగిన ప్రశ్నకు నువ్వే అని సమాధానం చెప్పాడు వర్మ. ఆ తర్వాత ఆమె చాలా ఫేమస్ అయిపోయింది. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 4లో అడుగుపెట్టిన అరియానా స్ట్రాంట్‌గా గేమ్ ఆడుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరియానాపై వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న అరియానా గురించి ఆ యాంకర్ వర్మ దగ్గర ప్రస్తావించగా.. తాను బిగ్‌బాస్ షో చూడనను అని చెప్పాడు. అసలు హౌస్‌లో ఎంత మంది ఉంటారు? అని తిరిగి యాంకర్‌నే ప్రశించాడు. దీంతో ఆమె 16 మంది అని చెప్పి.. అరియానా టాప్ 5లోకి కూడా వెళ్తుందని టాక్ అని యాంకర్ చెప్పింది. దీంతో అంటే ఆ ఐదుగురు విన్నర్స్ అవుతారా? అని వర్మ మళ్ళీ ప్రశ్నించాడు. అంతేకాకుండా అరియానాతో సినిమా తీయాలనుందని కూడా వర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అరియానా… వర్మ ఇచ్చిన ఈ ఆఫర్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.