Big Boss4 winner: బిగ్‌బాస్4 విజేతగా నిలిచింది అతడే… చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న అభిజిత్.

| Edited By: uppula Raju

Dec 21, 2020 | 6:05 AM

బిగ్‌బాస్ 4వ సీజన్ విజేతగా అభిజిత్ నిలిచాడు. బిగ్‌బాస్ ఇంటిలో తనదైన ఆట తీరు, నేర్పుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అభిజిత్ అందరి మనసులను దోచుకున్నాడు.

Big Boss4 winner: బిగ్‌బాస్4 విజేతగా నిలిచింది అతడే... చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న అభిజిత్.
Follow us on

Abijith wins bigg boss4: బిగ్‌బాస్ 4వ సీజన్ విజేతగా అభిజిత్ నిలిచాడు. బిగ్‌బాస్ ఇంటిలో తనదైన ఆట తీరు, నేర్పుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అభిజిత్ అందరి మనసులను దోచుకున్నాడు. ఎపిసోడ్.. ఎపిసోడ్‌కు ఆటలో పరిపక్వతత చూపిస్తూ తనదైన శైలిలో ముందుకెళ్లాడు. అటు హౌజ్ మేట్లతో సఖ్యత కొనసాగిస్తూనే.. మరోవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేస్తూ వచ్చాడు. మొత్తానికి ఓటింగ్‌లో ఏకపక్షంగా తన హవాను కొనసాగించాడు. మొదటి నుంచి అందరూ ఊహిస్తున్నట్లుగానే అభిజిత్ బిగ్‌బాస్4 ట్రోఫీని గెలుచుకొని మెగాస్టార్ చేతులతో కిరీటాన్ని అందుకున్నాడు. 105 రోజుల పోరాటంలో 16మంది కంటెస్టెంట్స్‌ను పక్కకు నెట్టి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. విన్నర్‌గా నిలిచాడని ప్రకటించగానే నాగ్ కాళ్లకు అభిజిత్ నమస్కరించాడు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చేప్పుడు బ్రోకెన్ హార్ట్‌తో వచ్చాను. కానీ వెళ్లేప్పుడు మాత్రం నిండు మనసుతో వెళ్తున్నాను. 11 వారాల పాటు నన్ను సేవ్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అభిజిత్.  ఇక బిగ్‌బాస్ 4 సీజన్‌లో అఖిల్ రన్నరప్ గా నిలిచాడు.