బిగ్ బాస్: ఫైనల్‌కు ‘ఆ ముగ్గురు’ ఫిక్స్!

|

Oct 20, 2019 | 4:12 PM

బుల్లితెర బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చివరి అంకంకు చేరుకుంది. 17 కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఇందులో ఒకరు ఇవాళ ఎలిమినేట్ కానున్నారు. వచ్చే వారం మరొకరు ఎలిమినేషన్ ఉండగా.. చివరికి 5 గురు కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుకుంటారు. అయితే ఇప్పటివరకు గేమ్ బట్టి చూస్తే టాప్ 3 కంటెస్టెంట్లు ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు చెందిన ఇంటి సభ్యులను […]

బిగ్ బాస్: ఫైనల్‌కు ఆ ముగ్గురు ఫిక్స్!
Follow us on

బుల్లితెర బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చివరి అంకంకు చేరుకుంది. 17 కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఇందులో ఒకరు ఇవాళ ఎలిమినేట్ కానున్నారు. వచ్చే వారం మరొకరు ఎలిమినేషన్ ఉండగా.. చివరికి 5 గురు కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుకుంటారు. అయితే ఇప్పటివరకు గేమ్ బట్టి చూస్తే టాప్ 3 కంటెస్టెంట్లు ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది.

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లకు చెందిన ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా పిలిచి.. ఫైనల్ 5కి అర్హత లేని వాళ్ళ పేర్లు చెప్పాలని సూచించారు. వారి పేర్లు చెప్పాక.. కంటెస్టెంట్లందరికి బిగ్ బాస్ ఓ గిఫ్ట్ పంపించారు. ఇక ఆ గిఫ్ట్‌తో పాటు నామినేషన్ నుంచి బయటపడిన వారి పేర్లను ఓ కార్డులో పెట్టారు.

ఇక వచ్చిన వారందరూ ఫైనల్‌కు అర్హత లేనివారిలో అలీ, శివజ్యోతి, వితికాలు ఉన్నారని చెప్పారు. అంతేకాక నెటిజన్ల ఛాయస్ కూడా ఇదే కావడం గమనార్హం. అటు సేఫ్ అయిన వాళ్ళ లిస్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. మొదట శ్రీముఖి, ఆ తర్వాత రాహుల్, బాబాలు సేఫ్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే శ్రీముఖి అందరి కంటే మొదట ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఏది ఏమైనా ఈ ముగ్గురు టాప్ 3లో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు వరుణ్ సందేశ్ ఈ లిస్ట్‌లో ఉండే ఛాన్స్‌ను కేవలం తన భార్యను కాపాడుకునే క్రమంలో కోల్పోయాడు. ఇక ఈ వారం ఇంటి నుంచి వితిక బయటికి వెళ్లనుందని ఇప్పటికే అనధికారికంగా వార్తలు వస్తున్నాయి.