పునర్నవి, రాహుల్ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్.. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరంటే.?

|

Nov 05, 2019 | 7:56 PM

బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. ఈ సీజన్ ఆధ్యంతం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని నెట్టింట్లో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రాహుల్ ఈ విషయంపై స్పందిస్తూ అందరికి షాక్ ఇచ్చాడు. పునర్నవి డ్రీం బాయ్‌ను తాను […]

పునర్నవి, రాహుల్ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్.. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరంటే.?
Follow us on

బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. ఈ సీజన్ ఆధ్యంతం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని నెట్టింట్లో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రాహుల్ ఈ విషయంపై స్పందిస్తూ అందరికి షాక్ ఇచ్చాడు.

పునర్నవి డ్రీం బాయ్‌ను తాను కాదని.. తనకంటే ముందు వేరే వ్యక్తి ఉన్నాడని రాహుల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా పున్నునే చెప్పిందని కూడా స్పష్టం చేశాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తనని డేటింగ్‌కు పిలిస్తే నిరాకరించిందన్నాడు. ‘మా ఇద్దరివీ వేరువేరు జీవితాలు.. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందని.. ఇద్దరం కేవలం స్నేహితులు మాత్రమే తప్పితే రొమాంటిక్ రిలేషన్ ఏమి లేదని’ రాహుల్ వెల్లడించాడు.

ఇకపోతే షో మొదట్లో అంచనాలు లేకుండా హౌస్‌లోకి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. యాంకర్ శ్రీముఖిని దాటుకుని మరీ టైటిల్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోఫీని అందుకున్న సంగతి తెలిసిందే.