అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ ఇంటి నుంచి ఈ వారం పునర్నవి ఎలిమినేట్ అయింది. టాస్క్‌ల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. 11 వారాలపాటు బిగ్ ఇంట్లో బాగానే నెట్టుకొచ్చింది. పునర్నవి వెళిపోవడంతో ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన రాహుల్ తట్టుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అయితే 11వ వారం నామినేషన్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్, మహేష్ విట్టాలు ఉన్నారు. శనివారం రోజు ఎపిసోడ్‌లో రాహుల్ సేవ్ కాగా.. రెండో కంటెస్టెంట్‌గా వరుణ్ కూడా సేఫ్ అయ్యాడు. ఇక మహేష్ విట్టా, పునర్నవిలలో.. మహేష్ సేఫ్ అయ్యాడు.
హౌస్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. స్టేజ్ పై ఫుల్ జోష్ తో కనిపించింది. బిగ్ బాస్ హౌస్‌లో తన జర్నీని చూసిన పున్ను.. ఎంతో మురిసిపోయింది. కాని రాహుల్ మాత్రం పునర్నవి వెళిపోయిందని కంటతడి పెట్టుకున్నాడు. వితిక, శ్రీముఖి, వరుణ్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. పునర్నవి లేకపోవడం నాకు పెద్ద లోటు. ఆమె నన్ను చాలా బాగా చూసుకుంది అంటూ రాహుల్ ఎమోషన్ అయ్యాడు. ఇక ఫైనల్‌గా వెళ్లిపోమాకే సాంగ్‌తో ఈ ఇద్దరి బిగ్ బాస్ ప్రేమ ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేశారు నాగార్జున.
చివరిసారి పునర్నవికి టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇంటిలో ఉన్న వారిలో ఎవరికి హగ్ ఇస్తావు? ఎవరికి పంచ్ ఇస్తావు.? అని ప్రశ్నించారు. అందులో మహేష్, బాబా భాస్కర్‌కు పంచ్ ఇచ్చిన పునర్నవి… వితిక, వరుణ్, అలీకి మాత్రం హగ్ ఇచ్చింది. ఇక రాహుల్ ‘నా వేస్ట్ ఫెల్లో’ అంటూ బిగ్‌హగ్ ఇచ్చింది పున్ను. టాస్క్‌లపై దృష్టి పెట్టాలని.. ఓవర్ ఎక్సైట్ కావొద్దని రాహుల్‌కు సూచించింది. ఇక ఇంట్లో బాబా భాస్కర్ బానిసగా ఉండాలని, అలీ రెజా మాస్టర్‌గా ఉండాలని బిగ్ బాంబ్ వేసింది.