బిగ్‌బాస్‌ షో టైటిళ్ల విన్నర్స్‌పై కత్తి మహేష్ సంచలన కామెంట్స్..!

| Edited By:

Nov 04, 2019 | 2:12 PM

బిగ్‌బాస్ 2, బిగ్‌బాస్ 3 విలువ వరుసగా.. షో ప్రతిష్టను దిగజార్చే విధంగా ఫైనల్ రిజల్ట్స్‌ ఉన్నాయని.. మూవీ క్రిటిక్ మహేష్ విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఉత్కంఠ నడుమ.. ప్రేక్షకులకు షాక్‌నిస్తూ.. బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్‌గా నిలిచాడు రాహుల్. మొదటి నుంచీ బిగ్‌బాస్ 3 విజేత శ్రీముఖి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. అనూహ్యంగా రాహుల్‌ ఇప్పుడు విన్ అవడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. అయితే.. దీనిపై స్పందించిన పలువురు […]

బిగ్‌బాస్‌ షో టైటిళ్ల విన్నర్స్‌పై కత్తి మహేష్ సంచలన కామెంట్స్..!
Follow us on

బిగ్‌బాస్ 2, బిగ్‌బాస్ 3 విలువ వరుసగా.. షో ప్రతిష్టను దిగజార్చే విధంగా ఫైనల్ రిజల్ట్స్‌ ఉన్నాయని.. మూవీ క్రిటిక్ మహేష్ విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అత్యంత ఉత్కంఠ నడుమ.. ప్రేక్షకులకు షాక్‌నిస్తూ.. బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్‌గా నిలిచాడు రాహుల్. మొదటి నుంచీ బిగ్‌బాస్ 3 విజేత శ్రీముఖి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. అనూహ్యంగా రాహుల్‌ ఇప్పుడు విన్ అవడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. అయితే.. దీనిపై స్పందించిన పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా.. రాహుల్‌ విన్నింగ్‌పై స్పందించిన మూవీ క్రిటిక్ మహేష్ సంచలన కామెంట్స్ చేశారు. బిగ్‌బాస్ సీజన్ 2, బిగ్‌బాస్ సీజన్ 3లు షో ప్రతిష్టను దిగజార్చే విధంగా ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయని.. బహుశా.. ఇది మన జనబాహుళ్యం మీద కూడా ఓ రిఫ్లెక్షన్‌ కావచ్చని.. ఫేస్‌బుక్‌లో కామెంట్ పోస్ట్ చేశాడు కత్తి మహేష్.

కాగా.. కత్తి మహేష్‌ కామెంట్స్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. చాలామంది మహేష్ కామెంట్స్‌ మద్దతు తెలుపుతున్నారు. అయితే.. వారు కేవలం రాహుల్‌ విన్నింగ్‌పై మాత్రమే కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో మహా బద్దకిస్ట్‌గా, ఇతరులపై ఆధారపడే వాడిగా, పునర్నవితో పులిహోర కలుపుతూ, టాస్క్‌లు అంటే బెంబేలెత్తిపోయే.. రాహుల్‌కి బిగ్‌బాస్ టైటిల్ ఎలా ఇచ్చారంటూ.. బిగ్‌బాస్‌ని నిలదీస్తున్నారు నెటిజెన్స్.

అయితే.. మరికొందరు మాత్రం మహేష్ కామెంట్స్‌ని తప్పుబడుతున్నారు. రాహుల్‌కి.. కౌశల్‌కి పోలికేంటని ఏకిపారేస్తున్నారు. బద్దకానికి.. బ్రాండ్‌ ఎంబాసిడర్ రాహుల్‌ అని.. పర్ఫామెన్స్‌కి.. బ్రాండ్ ఎంబాసిడర్ కౌశల్‌ అని కామెంట్స్ చేస్తున్నారు.