శ్రీముఖీకి.. కౌశల్ సపోర్ట్..!

తొలిరోజు నుంచే బిగ్‌బాస్-3 హాట్‌హాట్‌గా నడుస్తోంది. వరుసగా నామినేషన్లు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో నడుస్తుంది బిగ్‌బాస్ సీజన్ త్రీ. అయితే.. బిగ్‌బాస్ విన్నర్‌గా గెలవాలంటే హాస్‌లో ఎలా ఉంటున్నామో.. ఒక ఎత్తయితే.. సోషల్ మీడియా ప్రచారం కూడా అంతే అవసరం. అవును.. సోషల్ మీడియాలో ప్రచారం ద్వారానే కంటెస్టెంట్లకు ఓట్లు పడతాయ్. బిగ్‌బాస్2 విన్నర్ కౌశల్ గెలుపులో సోషల్ మీడియా చాలా కీలకం. కౌశల్ ఆర్మీ అంటూ.. ఆ ఆర్మీ వల్ల కౌశల్ గెలిచిన విషయం […]

శ్రీముఖీకి.. కౌశల్ సపోర్ట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 25, 2019 | 9:37 PM

తొలిరోజు నుంచే బిగ్‌బాస్-3 హాట్‌హాట్‌గా నడుస్తోంది. వరుసగా నామినేషన్లు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో నడుస్తుంది బిగ్‌బాస్ సీజన్ త్రీ. అయితే.. బిగ్‌బాస్ విన్నర్‌గా గెలవాలంటే హాస్‌లో ఎలా ఉంటున్నామో.. ఒక ఎత్తయితే.. సోషల్ మీడియా ప్రచారం కూడా అంతే అవసరం. అవును.. సోషల్ మీడియాలో ప్రచారం ద్వారానే కంటెస్టెంట్లకు ఓట్లు పడతాయ్. బిగ్‌బాస్2 విన్నర్ కౌశల్ గెలుపులో సోషల్ మీడియా చాలా కీలకం. కౌశల్ ఆర్మీ అంటూ.. ఆ ఆర్మీ వల్ల కౌశల్ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అదే ఇప్పుడు ఫాలో అవుతోంది.. బిగ్ బాస్ త్రీ కంటెస్టెంట్ శ్రీముఖి.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లకముందే శ్రీముఖి పేరు మీద ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేజీలు కనిపిస్తున్నాయి. అయితే.. తాజాగా కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దయచేసి నా పేరును కానీ.. కౌశల్ ఆర్మీని కానీ.. బిగ్‌బాస్ త్రీ కోసం లేదా పబ్లిసిటీ కోసం వాడుకోవద్దు ఇది నా వార్నింగ్ అంటూ పోస్ట్ చేశారు. చూస్తుంటే ఇది ఇన్‌డైరెక్టుగా శ్రీముఖీకే అని అంటున్నారు ఈ పోస్ట్ చూసిన కొందరు.