అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకంకు చేరుకుంది. 17 కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో.. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇక వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానుండగా.. ఫైనల్‌కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ టైటిల్ కోసం తలబడనున్నారు.
హౌస్‌లో రాహుల్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, శివజ్యోతి, శ్రీముఖిలు ఉండగా.. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతిలు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే బాబా భాస్కర్ కూడా ఫైనల్స్‌లోకి ఎంటర్ అయ్యాడు.
అటు సోషల్ మీడియాలో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడని చర్చ జరుగుతోంది. అంతేకాకుండా శ్రీముఖికి ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇదంతా కూడా రాహుల్ ఆర్మీ చేసిన పని వల్లనేనని ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శ్రీముఖి పుల్లలు పెడుతుందని.. ఆమె ఓవరాక్షన్ చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా ఫైనల్ ఫైవ్‌లో శ్రీముఖి కూడా ఉండటం ఖాయమే. కానీ ఆమె చివరి ఇద్దరిలో ఉంటుందో లేదో వేచి చూడాలి. అటు బాబా భాస్కర్, వరుణ్, అలీలకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరవుతారో ఆసక్తికరంగా మారింది.