తెలుగులో ‘బిగ్ బాస్’ మూడో సీజన్ స్టార్ట్ కాబోతున్నా.. ముందే వివాదాలు ఈ రియాలిటీ షోను చుట్టుముట్టాయి. సరిగ్గా షో మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతుందనగా.. వరుసగా ఊహించని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మొదటి రెండు సీజన్స్‌తో పోలిస్తే.. ఈ సీజన్ మొదలు కాకుండానే సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది.
ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ షోపై కేసులు వేసిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ కూడా ఫ్రీ- పబ్లిసిటీ స్టంటేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. షో పబ్లిసిటీ కోసమే నిర్వాహకులు ఈ వివాదాల్ని రాజేశారా.? ముంబై కల్చర్‌ను తెలుగులో కూడా పరిచయం చేయాలనీ భావించారా.? అనే సందేహాల్ని జనం వ్యక్తం చేస్తున్నారు. అయితే వివాదాలను రాజేయడం కోసం పోలీసుల్ని.. కోర్టుల్ని.. హ్యూమన్ రైట్స్ ని.. ఢిల్లీ మహిళా కమీషన్ ని.. సైతం రంగంలోకి దింపడం అసాధ్యమని కొందరి భావన. ఏదేమైనా మరికొద్ది గంటల్లో ‘బిగ్ బాస్’ మొదలవుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.