యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాలకు బాగా దగ్గరైన కమెడియన్ మహేష్ విట్టా.. ‘బిగ్ బాస్’ హౌస్‌లో మిగతా ఇంటి సభ్యుల పట్ల ప్రవర్తించే అతని తీరు నచ్చక కొంతమంది వ్యూయర్స్.. ఫస్ట్ ఎలిమినేషన్ క్రింద అతనిని బయటికి పంపించాలని నాగార్జునను అభ్యర్థిస్తున్నారు.
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3.. స్టార్ మా ఛానల్‌లో జూలై 21 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజే 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక అప్పుడే ‘బిగ్ బాస్’ ఆరుగురు ఇంటి సభ్యులైన రాహుల్ సిప్లిగంజ్, వితిక షేరు, పునర్నవి భూపాళం, హేమ, హిమజ, జాఫర్‌లకు షాక్ ఇస్తూ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో పెట్టాడు.
ఇక ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైన కొద్ది గంటల్లోనే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. నిన్నటితో ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ హౌస్ నుంచి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఎలిమినేషన్‌లో మహేష్ విట్టా లేకపోయినా.. కొంతమంది నెటిజన్లు అతడిని హౌస్ నుంచి పంపించేయాలని నాగార్జునను సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు.
మహేష్ విట్టా.. అన్ని టాస్క్‌ల్లో చురుకుగా పాల్గొంటానని అనడంతో.. మానిటర్ హేమ.. అతడిని ఎలిమినేషన్‌లో నుంచి తప్పించడం జరిగింది. అయితే అతడు మొదటగా ఇచ్చిన చిన్నపిల్లల టాస్క్‌లో పాల్గొనలేదు. ఇక ఆ తర్వాత శ్రీముఖితో చిన్న గొడవ జరగడం.. వరుణ్ సందేశ్ భార్య వితిక షేరుతో అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. దీని వల్ల వరుణ్ సందేశ్, మహేష్ విట్టా మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది.
మహేష్ విట్టాలోని ఈ ఊహించని యాంగిల్ చూసిన అభిమానులు.. ట్విట్టర్ వేదిక ద్వారా అతడిని ఎలిమినేట్ చేయమని అక్కినేని నాగార్జునను కోరుతున్నారు. అతడికి.. ఆడవారితో ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదని.. ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా మొదటి వారంలోని మహేష్ విట్టా ఫోకస్ కావడం.. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Eliminate Nagarjunag gaaru this #MaheshVitta from house
Worst character#Bigboss3telugu
— Tradewithme (@Trademe14) July 26, 2019
What went right for #MaheshVitta Today.
1. His acting
2. Realizing his mistake
3. Varun applauding his performanceWhat went right for Audience?@RahulSipligunj expressions when Srimukhi and Hema Akka are acting!!! ?#BiggBossTelugu3
— Santo! (@softwareudyogi) July 26, 2019
Chapathi kosam kotukovadam enti and #MaheshVitta gadini eliminate cheseyandi ladies ki respect ivvatle evartho sarigga untaled, @StarMaa @iamnagarjuna @bigbossTelugu #bigbosstelugu3 #Bigboss3 #bigboss And final ga ma @PunarnaviB Papa ki andharu vote esi gelpinchandi cute undhi?
— Saikiran Reddy (@varunnkeerthy) July 25, 2019