అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్-3 అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ షో రోజురోజుకి మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌మేట్స్ గ్రూపులుగా విడిపోయి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేయడంతో మూడో వారం రసవత్తరంగా మారింది. ఇక శనివారం ఎపిసోడ్‌లో నాగ్ కొంతమంది ఇంటి సభ్యులకు వార్నింగులు ఇవ్వడం జరిగింది.
కొద్దిరోజుల క్రిందట అలీ- హిమజ మధ్య ఓ పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. దీని గురించి ప్రస్తావించిన నాగ్.. అలీ ప్రవర్తన కరెక్ట్ కాదని చివాట్లు పెట్టి.. అతని చేత 21 గుంజీలు తీయించాడు. అటు వీరిద్దరి మధ్యలో జోక్యం చేసుకుని అలీకి అడ్డుపడిన తమన్నాను నాగ్ ప్రశంసించాడు.
మరోవైపు ఇంకో టాస్క్‌లో భాగంగా నగదు బాక్స్ అద్దం పగలగొట్టిన రవికృష్ణకి చేయి తెగినప్పుడు శ్రీముఖిపై నోరు జారిన రాహుల్ పైనా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీముఖిని ఉద్దేశించి రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలను నాగార్జున గుర్తు చేస్తూ సీరియస్ అయ్యారు. ఇదే నీకు ఆఖరి వార్నింగ్.. వెళ్లి శ్రీముఖికి సారీ చెప్పు అని హెచ్చరించాడు.
అటు తమన్నా సింహాద్రికి కూడా నాగ్ చివాట్లు పెట్టడం జరిగింది. రవికృష్ణను అంతలేసి మాటలు అనడం తప్పని.. మొదటి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి.. ఇప్పుడు అతనిని తిడతారా అని తమన్నాను ప్రశ్నించాడు. ఆమె ప్రవర్తించిన తీరుకు కోపగించుకుని.. క్లాస్ పీకారు. అటు జ్యోతితో గొడవపడిన సమయంలో కూడా తమన్నా జర్నలిస్టులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇక అందుకు సంబంధించిన వీడియోను నాగ్ ప్లే చేసి చూపిస్తున్నప్పుడు తమన్నా నవ్వుతూ తలవంచుకుంది. దానికి కోప్పడిన నాగ్.. ఆమె చేత శివజ్యోతితో సహా మొత్తం జర్నలిస్టులందరికీ సారీ చెప్పమన్నాడు. దీనితో ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. కాగా ఈ వారం ఎలిమినేషన్స్‌లో బాబా భాస్కర్ – రాహుల్ – పునర్నవి – వితిక – తమన్నాలు ఉన్న సంగతి తెలిసిందే.
వీళ్లలో తమన్నా ఈ వారం ఎలిమినేట్ అయిందని ఇన్‌సైడ్ టాక్. బిగ్ బాస్ హిస్టరీలోనే అతి తక్కువ ఓట్లు (5%) వచ్చాయని తెలుస్తోంది.