అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3.. నాలుగు వారాలు ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో రాహుల్ – హిమజ – అషు – మహేష్ – పునర్నవి – శివజ్యోతి – బాబా భాస్కర్‌లు ఉన్నారు. అందులోనూ నామినేషన్ ప్రక్రియలో హౌస్‌మేట్స్ మధ్య పెద్ద వాగ్వాదమే చోటు చేసుకుంది.
ఇది ఇలా ఉండగా హౌస్‌లోనే మంచోడిగా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్‌ను అలీ రెజా నామినేట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అదీ కాకుండా వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా.. కొన్ని టాస్క్‌లలో అలీని బాబా భాస్కర్ సేవ్ చేయడం జరిగింది. ఐదోవారం కెప్టెన్ అయిన అలీ.. డైరెక్ట్ నామినేషన్‌గా బాబా భాస్కర్‌ను ఎంచుకోవడం.. పైగా చెప్పిన కారణాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి.
ఇక తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయంపై మహేష్ విట్టా.. అలీ వద్ద ప్రస్తావించగా.. ఇద్దరి మధ్య చిన్న గొడవ చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి.. ఈ ఇద్దరి స్నేహితుల మధ్య అసలు విలన్ ఎవరో తెలిసిపోతుంది.
War of words between #AliReza & #MaheshVittta#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/qs6ydmAb8g
— STAR MAA (@StarMaa) August 20, 2019