సండే ఈజ్ ఫన్ డే అంటూ.. అటు హౌస్‌మెట్స్‌కి.. ఇటు ప్రేక్షకులకు టెన్షన్ పెడుతూంటారు.. కింగ్ నాగ్. బిగ్‌బాస్ 3 నుంచి.. ప్రేమ జంట.. సింగర్ రాహుల్, పునర్నవి ఔట్ అవుతారని అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినా.. దానికి రివర్స్‌గా నిన్న హౌస్‌లో రాహుల్ సేవ్ అయ్యాడు. దీంతో.. ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరికీ ఆసక్తి నెలకొంది.
హౌస్‌లో వరుణ్.. చాలా బెస్ట్ కంటెస్టెంట్. అటు.. ఫ్యాన్స్ కూడా.. వరుణ్ చివరి వరకూ ఉంటాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. అతను ఆట కూడా బాగా ఆడుతున్నాడు. ఎవరితోనూ.. ఎలాంటి విదాలు లేవు. కాబట్టి వరుణ్ బయటకు వెళ్లే ఛాన్స్ తక్కువ.
అసలే హౌస్‌కి ఇంకా నాలుగు వారాలే టైం ఉంది. అప్పుడప్పుడు డబుల్ నామినేషన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అయితే.. ఈ వారం కంటెస్టెంట్స్ మహేష్ విట్టా, పునర్నవిలు బయటకు వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది. శనివారం నాగార్జున.. ఇచ్చిన ‘ఇంటికి ఎవరు భారం’ టాస్క్‌లో హౌస్‌మెంట్స్ ఎక్కువగా మహేష్‌ని సెలెక్ట్ చేశారు.