అందరూ అనుకున్నట్లుగానే ఐదో వారం జూనియర్ సమంతా ఆషురెడ్డి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటి వెళ్ళింది. ఎలిమినేషన్స్ విషయంలో షో నిర్వాహకులు లీకులను నియంత్రించడానికి ఎంత ప్రయత్నించినా.. అది విఫలమవుతూనే ఉంది. షో మొదటివారం నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒక్క రోజు ముందుగానే సోషల్ మీడియాలో తెలిసిపోతోంది. ఆదివారం జరిగిన ఐదోవారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది. నాగార్జున హౌస్‌మేట్స్‌తో క్యారెక్టర్స్ మార్చుకునే ఆట ఆడించడం హైలైట్‌గా నిలిచింది. కంటెస్టెంట్లందరూ కూడా చురుకుగా పాల్గొన్నారు.
ఇక ఈ టాస్క్‌లో పునర్నవి, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక, అలీ రాజాలు చక్కగా నటించి ఫన్ క్రియేట్ చేశారు. అనంతరం టాస్కులు ముగిసిన తర్వాత ఆషురెడ్డి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. ఆనవాయితీ ప్రకారం బయటికి వచ్చిన ఆషుతో నాగార్జున మరో గేమ్ ఆడించాడు. హౌస్‌లో ఉండేందుకు ఎవరికి అర్హత ఉంది? ఎవరికి అర్హత లేదు? అని చెప్పాలి.. అర్హత లేదు అనుకునే వారి ఫోటోలను పగలగొట్టాలని తెలిపాడు. దీంతో మహేష్, రాహుల్, వితికా, హిమజలకు హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ వారి ఫోటోలను పగలగొట్టింది.