ఆ జంట డేటింగ్ డిస్కషన్.. హౌస్‌లో లవ్ ట్రాక్ మొదలైందా.?

|

Aug 08, 2019 | 4:50 AM

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు వారాలు పూర్తయ్యి మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక హౌస్‌లోని ప్రవర్తన బట్టి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారని చెప్పవచ్చు. గత వారం ఎలిమినేషన్ విషయంలో.. తాజాగా పునర్నవి, రాహుల్ సింప్లీగంజ్ మధ్య జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిలో ఆకర్షించింది. కొద్దిరోజుల క్రితం ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ […]

ఆ జంట డేటింగ్ డిస్కషన్.. హౌస్‌లో లవ్ ట్రాక్ మొదలైందా.?
Follow us on

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు వారాలు పూర్తయ్యి మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక హౌస్‌లోని ప్రవర్తన బట్టి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారని చెప్పవచ్చు. గత వారం ఎలిమినేషన్ విషయంలో.. తాజాగా పునర్నవి, రాహుల్ సింప్లీగంజ్ మధ్య జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిలో ఆకర్షించింది.

కొద్దిరోజుల క్రితం ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడగడం. దానికి పునర్నవి డేట్‌లో ఉన్నానని చెప్పడం జరిగింది. ఇక ఈ విషయాన్ని శనివారం నాగార్జున ప్రస్తావించారు. ఆయన చేతిలో ఉండే కోతి.. ఈ మధ్య అతడు డేటింగ్ గురించి మాట్లాడుతున్నాడు బాస్ అంటూ అనగానే అందరూ రాహుల్ వైపు చూశారు. అప్పుడు రాహుల్ ఏదో సమాధానం చెబుతుండగా.. నాగ్ కలుగజేసుకుని నువ్వు సేఫ్ అయ్యావ్ అని చెప్పడంతో దానికి పుల్‌స్టాప్ పడిపోయింది.

ఆ డేటింగ్ విషయమై పునర్నవి – రాహుల్ మధ్య తాజాగా సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన అన్ సీన్ వీడియోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో ‘అందరూ డేటింగ్ డేటింగ్ అంటుంటే నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు. నాగార్జున గారికి ఎందుకు సమాధానం చెప్పలేదని రాహుల్‌ను ప్రశ్నిస్తుంది పునర్నవి. దానికి రాహుల్ సమాధానం ఇస్తూ ‘నేను నీ పక్కనే ఎప్పుడూ కూర్చోలేదు. నాగ్ సార్‌కు కూడా చెప్పా మాది ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అని చెబుతుంటే ఆయన ఆపు ఆపు అన్నారు. ఇప్పుడేమైంది..? ఏమైనా ప్రాబ్లమా..?’ అని అనగానే పునర్నవి కొంటె నవ్వు నవ్వింది. ఇక పక్కనే ఉన్న వితికా షెరూని పిలిచి పునర్నవి ఏం అంటుదో తెలుసా? తనతో డేటింగ్ వల్లే నన్ను ఎలిమినేట్ చేయకుండా ఉంచారని అనుకుంటున్నారట అని రాహుల్ చెప్పడంతో.. అరే ఆమె అలా అనలేదు నీకు సరిగా అర్ధంకాలేదని చెప్పుకొచ్చింది వితిక. అప్పుడు రాహుల్ చివర్లో నా బతుకు ఏంటో జిందగీలో ఈ అమ్మాయినే కలవాలని ఉందేమో అని అనడంతో పునర్నవి.. అతడి ముఖంపై చిటికెలు వేస్తూ ఆటపట్టిస్తోంది. ఈ సంభాషణ చూస్తుంటే లవ్ ట్రాక్ షురూ అయినట్లే అనిపిస్తుంది. ఏది ఏమైనా రెండో సీజన్‌లో తేజస్వి- సామ్రాట్ జోడి మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా ఓ జోడీని చూసే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.