బిగ్‌బాస్-3 తెలుగు షో మొదలైన కాన్నుంచీ రోజుకో వివాదం రాజుకుంటుంది. మొన్నటివరకూ రాహుల్, వితిక, వరుణ్, పునర్నవి హాట్ టాపిక్ అయితే.. ఆ తర్వాత.. తమన్నా.. వీరంగం సృష్టించింది. నిన్న షోలో అలీ, హిమజల మధ్య వివాదం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు హౌస్‌మెంట్స్ అందరికీ శ్రీముఖి విలన్ అయ్యింది.
బిగ్‌బాస్.. మంగళవారం కంటెస్టెంట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చింది రచ్చ రచ్చ చేయాలని మహేష్ ఇచ్చిన సలహా మేరకు శ్రీముఖి ఇంట్లోని నిధిని డంబుల్‌తో పగలకొడుతుంది. ఈ సందర్భంలో రవి చేతికి పెద్ద గాయమై.. తీవ్ర రక్తస్రావమవుతుంది. దీంతో.. ఇంట్లో రచ్చ షురూ అవుతుంది. శ్రీముఖినే అంతా చేసిందంటూ.. హౌస్‌లోనందరూ ఆమెపై విరుచుకుపడతారు.
అయితే.. దీంతో.. ఈ రోజు రాత్రి.. శ్రీముఖి.. ఇంటి నియమాలను పాటించలేదని బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు.. ఆమెను ఇంటి నుంచి బయటకు పంపుతున్నట్లు స్టార్ మా ఓ వీడియో చేశారు. ఈ స్టార్ మా బిగ్ బాస్ ప్రోమో చూస్తుంటే.. నిజంగానే శ్రీముఖి ఇంటినుంచి వెళ్తుందా..? అనే సందేహం కల్గుతుంది.
హౌస్‌లో తమన్నా.. వీర లెవల్లో రెచ్చిపోతూ.. అసభ్యకరంగా మాట్లాడుతూ.. నిబంధనలు గుర్తుకురాని బిగ్‌బాస్‌కు శ్రీముఖి విషయంలో ఎందుకు సడెన్‌గా స్పందించారనేది అర్థంకాని విషయమే. అయితే.. శ్రీముఖీని ఇంటి నుంచి పంపిస్తున్నట్లుగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమో సస్పెన్స్‌గానే ఉంది. ‘శ్రీముఖి.. మీరు రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి.. ఇంటి నుండి బయటకు పంపడానికి’ అని బ్రేక్ ఇవ్వడంతో.. ఇది షో రేటింగ్స్ పెంచడానికి మరో కారణమా.. ఏంటి అనేది తెలియాలంటే.. రాత్రి బిగ్ బాస్ షో వచ్చేంతవరకూ ఎదురు చూడక తప్పదు.
#Sreemukhi ki siksha enti?? #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Ox0RoJWskf
— STAR MAA (@StarMaa) August 8, 2019