బిగ్ బాస్: యాడ్స్‌తో ‘యాంకరమ్మ’ గట్టెక్కేనా?

|

Oct 17, 2019 | 1:16 PM

బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. ఫైనల్‌కు ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు కాబట్టి వచ్చే వారంలోపు ఇద్దరి కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు ఉండగా.. అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగానే ఉన్నారు. అంతేకాక బిగ్ బాస్ టైటిల్ కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ తన సర్వశక్తులను ఉపయోగిస్తున్నారు. ఇక హౌస్‌లో ఉన్న అందరిలోనూ యాంకర్ శ్రీముఖికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న […]

బిగ్ బాస్: యాడ్స్‌తో యాంకరమ్మ గట్టెక్కేనా?
Follow us on

బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో షో ముగియనుంది. ఫైనల్‌కు ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు కాబట్టి వచ్చే వారంలోపు ఇద్దరి కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు ఉండగా.. అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగానే ఉన్నారు. అంతేకాక బిగ్ బాస్ టైటిల్ కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ తన సర్వశక్తులను ఉపయోగిస్తున్నారు. ఇక హౌస్‌లో ఉన్న అందరిలోనూ యాంకర్ శ్రీముఖికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె బిగ్ బాస్‌లోకి రాకముందే శ్రీముఖి ఆర్మీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు శ్రీముఖి ఎన్నిసార్లు నామినేషన్స్‌లోకి వచ్చినా.. భారీ ఓటింగ్‌తో ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు సీజన్ చివరికి చేరుకోవడం పైగా ఈ వారం ఆమె ఎలిమినేషన్స్‌లోకి రావడంతో ఆర్మీ ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. ఆమె ఫ్యాన్స్.. శ్రీముఖిని గెలిపించమని ఏకంగా థియేటర్లలో యాడ్స్ వేయడం విశేషం. ‘ఓట్ ఫర్ శ్రీముఖి’ అంటూ ఫోన్ నంబర్ తో సహా ఈ ప్రకటన ఇప్పుడు థియేటర్లలో కనిపిస్తోంది. ఇక ఈ యాడ్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి వైరటీ యాడ్స్ వల్ల ఆమెకు ఓట్లు పడవని.. ఆమెకు ఎంత ప్రచారం చేసినా డబ్బులు వేస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం చిరు ఫ్యాన్స్ సపోర్ట్ కూడా శ్రీముఖికి ఉన్నట్లు నెట్టింట్లో ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మెగా ఫ్యాన్స్ కూడా స్పందిస్తూ.. ఆమె కోసం తాము ఎటువంటి ప్రచారం చేయట్లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా హౌస్‌లో ఉన్న భారీ పోటీ రీత్యా శ్రీముఖి ఫ్యాన్స్ ఎంతగా శ్రమ పడినా.. ఆమె ఫైనల్ విజేతగా నిలవడం కష్టమేనన్న వార్తలు వస్తున్నాయి.