బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరగవచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరికీ తెలీదు.. ఎప్పుడు ఎవరు వైల్డ్‌గా మారతారో కూడా చెప్పలేం.. ఇప్పుడు సన్నిహితంగా ఉన్నవారే.. రేపు శత్రువులు అవుతారు. తాజాగా.. బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్‌లో ఎవరికి వారే.. వారి మీద నెగిటీవ్ యాంగిల్ పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు హౌస్‌లో అదే జరిగింది.. అలీ.. హిమజలు.. కాస్త సైలెంట్‌గా ఉన్నవారే.. ఉన్నట్టుండి.. నిన్న జరిగిన టాస్క్‌లో ఇద్దరు గొడవపడ్డారు. ఆ సందర్భంలో హిమజ.. అలీని కాలితో తన్నుతుంది. దానికి అలీ.. పెద్దగా అరుస్తూ.. గొడవపడ్డాడు. హిమజ సర్థి చెప్పేందుకు ట్రై చేసిన అలీ వినిపించుకోలేదు.
బిగ్‌బాస్.. ఇచ్చిన టాస్క్ ప్రకారం.. శ్రీముఖి, రవికృష్ణ, అషు రెడ్డి.. కథనం ప్రకారం నిధిని కొట్టేయడానికి ప్లాన్ వేస్తారు. రాహుల్, వితికా, వరుణ్, రోహిణి, అలీ నిధిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారు. శివజ్యోతి, బాబా భాస్కర్ పోలీసులు, హిమజ లాయర్‌గా వ్యవహరిస్తూంటారు. అయితే.. ఈ సందర్భంలో.. నీళ్లు తాగేందుకు వెళ్లిన హిమజను అలీ డబ్బులు అడుగుతాడు. దీనికి హిమజ నిరాకరిస్తుంది. దీంతో.. హిమజ జేబులో చేయిపెట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాడు అలీ.. దాంతో హిమజ అతని ముఖంపై తన్నుతుంది. దీంతో.. కోపంతో ఊగిపోయిన అలీ.. ఆమెపై దాడికి యత్నిస్తాడు. దీంతో.. గొడవ పెద్దది అవుతుంది.
కాగా.. ఆ తర్వాత హిమజ నేనే తప్పు చేశాను.. అని అలీకి సారీ చెప్తుంది.. అలీ ఓప్పుకోకపోవడంతో.. అతని కాళ్లపై పడుతుంది. దీంతో.. అలీ.. జనాల సింపతీ కోసం ఇలా చేయకు అనడంతో.. హిమజ మళ్లీ హర్ట్ అయ్యి.. బాత్రూమ్‌కి వెళ్లి బోరున ఏడుస్తుంది. దీంతో తమన్నా ఎంట్రీ అయ్యి.. హిమజకు మద్దతుగా.. అలీతో గొడవకు దిగుతుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇద్దరూ.. ఇద్దరి తప్పుల గురించి చర్చించుకుంటూ.. సారీలు చెప్పుకుంటారు.