యాంకరింగ్‌తో.. టాప్‌ లేపేసిన శివగామి..!

ఎన్నో వివాదాలతో మధ్య మొదలైన ‘బిగ్‌బాస్3’ షో.. ప్రస్తుతం హయ్యెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితం బర్త్ డే సెలబ్రేషన్స్‌ కోసం.. స్పెయిన్ వెళ్లిన నాగ్.. స్థానంలో.. శివగామి అలియాస్ రమ్యకృష్ణ.. నేను చెప్పిందే శాసనం.. అంటూ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇంట్రీతో ఒక్కసారిగా.. బిగ్‌బాస్ ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఆమె ఎలా షోను హ్యాండిల్ చేస్తుందని.. అందరూ కాస్త అనుమానించినా.. ఒకానొక సందర్భంలో.. నాగ్.. […]

యాంకరింగ్‌తో.. టాప్‌ లేపేసిన శివగామి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 02, 2019 | 5:49 PM

ఎన్నో వివాదాలతో మధ్య మొదలైన ‘బిగ్‌బాస్3’ షో.. ప్రస్తుతం హయ్యెస్ట్ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితం బర్త్ డే సెలబ్రేషన్స్‌ కోసం.. స్పెయిన్ వెళ్లిన నాగ్.. స్థానంలో.. శివగామి అలియాస్ రమ్యకృష్ణ.. నేను చెప్పిందే శాసనం.. అంటూ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇంట్రీతో ఒక్కసారిగా.. బిగ్‌బాస్ ప్రేక్షకులు షాక్ తిన్నారు. ఆమె ఎలా షోను హ్యాండిల్ చేస్తుందని.. అందరూ కాస్త అనుమానించినా.. ఒకానొక సందర్భంలో.. నాగ్.. కంటే రమ్యనే బాగా చేసిందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. అటు.. కంటెస్టెంట్స్‌తో.. ముద్దు ముద్దుగా మాట్లాడుతూనే.. శివగామి స్టైల్లో క్లాస్‌ తీసుకుంది.

హౌస్‌లో.. ఇంటి సభ్యులకు జరిగిన అన్యాయాలేంటో.. తెలుసుకుని.. తక్షణమే పరిష్కరించింది. ముఖ్యంగా బిగ్‌బాస్‌లోని జంట్స్.. లేడీస్ పట్ల ప్రవర్తించిన తీరును ఖండిచింది. అలాగే.. ఎక్కువగా అందరూ.. వితికనే ఎందుకు టార్గెట్ చేశారంటూ ఇంటి సభ్యులను ప్రశ్నించింది శివగామి. అలాగే.. నా కోసం స్పెషల్‌గా.. స్పైసీగా ఓ డిష్ కావాలంటూ.. బాబా మాస్టర్‌కు ఆర్డర్ వేసింది రమ్యకృష్ణ. ఓ పక్క తప్పులను.. చూపిస్తూ.. ఫన్‌ను నింపింది. మొత్తానికి శివగామి అలియాస్ రమ్య బిగ్‌బాస్‌3 షోను తన గ్లామర్ అండ్ మాటలతో హీట్ పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత.. మళ్లీ బిగ్‌బాస్‌ షోలో జోష్ వచ్చిందని నెటిజన్లు చెప్తున్నారు. మళ్లీ ఆమెనే యాంకరింగ్ చేస్తే బాగుండు అని నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా.. నాగ్ స్పెయిన్ టూర్ కారణంగా.. ఈసారి బిగ్‌బాస్‌ షోలో ఎలిమినేషన్‌ను క్యాన్సెల్ చేశారు షో నిర్వాహకులు.