AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 13: రేషన్ కోసం కంటెస్టెంట్ల మధ్య హాట్ గేమ్.. గెలుపెవరిదంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారో లేదో బిగ్ బాస్ అప్పుడే వారికి టాస్క్ ఇచ్చేశాడు. ‘బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్’ అనే టాస్క్‌తో బిగ్ బాస్ ఇంటి సభ్యులను జంటలుగా విభజించి సీజన్ మొత్తం బెడ్‌ను షేర్ చేసుకునే విధంగా ప్లాన్ చేశాడు. ఈ టాస్కును కొందరు వ్యతిరేకించారు. అందులో ముఖ్యంగా బ్రేకప్ పెయిర్ సిద్ధార్థ్ శుక్లా, […]

బిగ్ బాస్ 13: రేషన్ కోసం కంటెస్టెంట్ల మధ్య హాట్ గేమ్.. గెలుపెవరిదంటే?
Ravi Kiran
|

Updated on: Sep 30, 2019 | 9:27 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారో లేదో బిగ్ బాస్ అప్పుడే వారికి టాస్క్ ఇచ్చేశాడు. ‘బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్’ అనే టాస్క్‌తో బిగ్ బాస్ ఇంటి సభ్యులను జంటలుగా విభజించి సీజన్ మొత్తం బెడ్‌ను షేర్ చేసుకునే విధంగా ప్లాన్ చేశాడు.

ఈ టాస్కును కొందరు వ్యతిరేకించారు. అందులో ముఖ్యంగా బ్రేకప్ పెయిర్ సిద్ధార్థ్ శుక్లా, రష్మీ దేశాయ్ మొదటివారిగా ఉండటం గమనార్హం. ఇక మిగిలిన కంటెస్టెంట్లయితే వారి బెడ్‌ను తమ పార్టనర్స్‌తో పంచుకోవడానికి సుముఖత తెలిపారు. కోయినా మిత్రా- షెఫాలీ బగ్గా, పరాస్ చాబ్రా – ఆర్తి సింగ్- దేవోలీనాలు జంటలుగా మారారు.

ఇకపోతే హీరోయిన్ అమీషా పటేల్ ‘మాల్కిన్’ రూపంలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్లకు విచిత్రమైన టాస్క్‌ను పరిచయం చేసింది. ఇంటి సభ్యులు రేషన్ కోసం ఓ ఆట ఆడాలని ఆమె సూచించింది. ఒక ఫుల్ బాక్స్ నిండా ఆమె కిరాణా సామాన్లను తీసుకొచ్చి.. ఇంటి సభ్యులు వాటి నుంచి కావాల్సిన ఐటమ్స్ నోటి ద్వారా ఒకరి నుంచి మరొకరు పాస్ చేసుకుంటూ మరో డబ్బాలోకి పెట్టాలని చెప్పింది. అలా ఎన్ని సరుకులను వాళ్ళు మార్చగలిగితే అంత రేషన్ లభిస్తుందని తెలిపింది. దీనితో కంటెస్టెంట్లు ఈ టాస్క్‌ను ఛాలెంజ్‌గా తీసుకోగా.. మధ్యలో చిన్న చిన్న వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 13 నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో.. అలాంటి స్పైసీ స్టఫ్‌తోనే మొదలైందని చెప్పొచ్చు.

Follow Us