హౌస్‌లో కిచెన్ పేచీ.. టార్గెట్ చేసింది నన్నే – హేమ

|

Jul 30, 2019 | 5:05 PM

‘బిగ్ బాస్ 3’ నుంచి మొదటి ఎలిమినేషన్‌గా నటి హేమ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ అవడంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తొలివారం అందరి ఫోకస్ తన మీదే ఉందని.. తాను హౌస్‌లో ఎవరిపైనా డామినేట్ చేయలేదని హేమ అన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని విషయాలు మాత్రమే చూపించి.. మిగిలినవి ఎడిటింగ్‌లో తీసేశారని ఆమె తెలిపింది. తాను హౌస్‌లో ఎలాంటి పొరపాట్లు చేయలేదని.. మిగిలిన కంటెస్టెంట్ల స్ట్రాటజీ […]

హౌస్‌లో కిచెన్ పేచీ.. టార్గెట్ చేసింది నన్నే - హేమ
Follow us on

‘బిగ్ బాస్ 3’ నుంచి మొదటి ఎలిమినేషన్‌గా నటి హేమ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ అవడంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తొలివారం అందరి ఫోకస్ తన మీదే ఉందని.. తాను హౌస్‌లో ఎవరిపైనా డామినేట్ చేయలేదని హేమ అన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని విషయాలు మాత్రమే చూపించి.. మిగిలినవి ఎడిటింగ్‌లో తీసేశారని ఆమె తెలిపింది. తాను హౌస్‌లో ఎలాంటి పొరపాట్లు చేయలేదని.. మిగిలిన కంటెస్టెంట్ల స్ట్రాటజీ ఏమిటో తనకు తెలియదంది. బయట ఎలా ఉంటానో.. అలాగే తాను హౌస్‌లో ఉన్నానని.. కిచెన్ విషయంలో కొంత వివాదం తలెత్తిందని హేమ చెప్పుకొచ్చింది.

అటు హౌస్‌లోని కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. తాను మంచోడినని ప్రూవ్ చేసుకోవడానికి బాబా మాస్టర్ ప్రయత్నిస్తున్నారని.. ఆ తర్వాత జాఫర్.. చిన్నపిల్లాడిలా యాక్ట్ చేస్తే.. తన గురించి బయట ఏ విధంగా రాస్తారని టెన్షన్ పడుతున్నట్లు చెప్పింది. శ్రీముఖి అయితే రెండు విధాలుగా మాట్లాడుతూ అందరిని మానిప్యులేట్ చేస్తోందని.. ఆ విషయాన్ని తాను చెప్పినా కూడా పట్టించుకోలేదని హేమ తెలిపింది. హిమజ కూడా ప్రతి విషయానికి ఏడుస్తూ మానిప్యులేట్ చేస్తుందని.. అలీ మాత్రం అన్ని టాస్క్‌లు చక్కగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చింది. ఇక సింగర్ రాహుల్ గురించి ప్రస్తావిస్తూ.. ఆ అబ్బాయి చేసిన తప్పు గురించి తాను వివరించానని.. అది టెలికాస్ట్ చేశారో లేదో తనకు తెలియదంది. ఇక తన ఓటు మాత్రం ఆషు రెడ్డికి వేస్తానని.. హౌస్‌లో ఆ అమ్మాయి చిన్న పిల్ల మాదిరి ఉందని.. ఆమెకు మెచ్యూరిటీ వచ్చి.. మరికొన్ని రోజులు బిగ్ బాస్‌లో ఉండాలని కోరుకుంటున్నట్లు హేమ తన అభిప్రయాన్ని వ్యక్తం చేసింది.  .