Big News Big Debate: రోడ్డెక్కిన రాజకీయం.. ఏపీలో జీవో నెంబర్ 1పై మాటల తూటాలు..
Big News Big Debate: కొత్త సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ జీవో రాష్ట్రవ్యాప్తంగా టాప్ లెవల్ హీట్ పుట్టించింది. కందుకూరు ఘటన నేపథ్యంలో రోడ్లపై సభలు నియంత్రించడానికే జీవో..
కొత్త సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ జీవో రాష్ట్రవ్యాప్తంగా టాప్ లెవల్ హీట్ పుట్టించింది. కందుకూరు ఘటన నేపథ్యంలో రోడ్లపై సభలు నియంత్రించడానికే జీవో ఇచ్చామని వైసీపీ అంటే.. ప్రతిపక్షాలకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక కుట్ర అంటున్నాయి విపక్షాలు. ఇదో అనధికార ఎమెర్జెన్సీ అని టీడీపీ అంటే.. రాజ్యాంగ హక్కులను కూడా నిషేధిస్తారా అంటూ ప్రశ్నించింది జనసేన. ఎవరేమనుకన్నా ప్రజల ప్రణాలే తమకు ముఖ్యమంటోంది వైసీపీ. ఇక కుప్పంలో కొత్త జీవో ప్రకారం యాక్షన్ కూడా స్టార్ట్ చేశారు లోకల్ పోలీసులు.
తెల్లవారుతూనే ఏపీలో వచ్చిన జీవో నెంబర్ వన్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఇరుకు సందుల్లో భారీ సభలతో జనాలు పడుతున్న ఇబ్బందులు, కందుకూరులో పోయిన ప్రాణాల నేపథ్యంలో ప్రభుత్వం పాత పోలీస్ యాక్ట్ 1861 ఆధారంగా సరికొత్త జీవో తీసుకోచ్చింది. 2023లో వచ్చిన ఫస్ట్ జీవో కూడా ఇదే. ఇకపై రోడ్లపై మీటింగులు పెడతామంటే కుదరదని.. అరుదైన సందర్భాల్లో మాత్రమే అనుమతి ఇచ్చేలా జీవోలో పెట్టారు. రోడ్లున్నది ప్రజల సౌకర్యం కోసమే కానీ.. ప్రాణాలు తీయడానికి కాదంటోంది ప్రభుత్వం.
విపక్షాల వెర్షన్ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. వైసీపీ మినహా అన్నిపార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. జీవో అనధికారిక ఎమెర్జెన్సీ అంటున్న పార్టీలు ఎవరికి వారు తమ నేతలకు అడ్డుకునే కుట్ర అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీలో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. నియంత్రణ మంచితే అని సోము, జీవీఎల్ వంటివారు అంటే.. మరికొందరు ఇందుకు భిన్నంగా అణిచివేత అంటున్నారు.
ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా ఈ విషయంలో వైసీపీ ఫుల్ క్లారిటీతో ఉంది. జీవోలపై కోర్టుకు వెళ్లే హక్కు అందరికీ ఉంటుంది. చంద్రబాబు, పవన్ బస్సు యాత్ర కోసం జీవో తెచ్చారనేది వాళ్ల ఊహ అంటోంది వైసీపీ. జీవో రావడమే కాదు కుప్పంలో దీనిపై యాక్షన్ కూడా స్టార్ట్ అయింది. కొత్త జీవో ప్రకారం చంద్రబాబు సభ పూర్తి వివరాలు ఇస్తేనే అనుమతిస్తామంటూ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో వ్యవహారం సరికొత్త టర్న్ తీసుకుంది.
ఇదే అంశంపై టీవీ తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్‌లో చర్చించారు. ఈ వీడియోను కింద చూడొచ్చు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..