తెలుగు నేలపై కమలవికాసం సాధ్యమేనా?

తెలుగురాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాం మార్చింది. తొకపార్టీగా ఉన్న ముద్ర నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కమలనాథులు 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుల మార్పు ఇందులో..

తెలుగు నేలపై కమలవికాసం సాధ్యమేనా?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 08, 2020 | 8:48 AM

తెలుగురాష్ట్రాల్లో బలమెంత.. గెలిచే సత్తా ఎంత? ఏపీలో ఓటు శాతం లేదు తెలంగాణలో ఎంపీ సీట్లు బలం

తెలుగురాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాం మార్చింది. తొకపార్టీగా ఉన్న ముద్ర నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కమలనాథులు 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ అధ్యక్షుల మార్పు ఇందులో భాగమంటున్నాయి పార్టీ వర్గాలు. రెండు చోట్లా పార్టీ లాయల్టీతో పాటు పరివారం, హిందూ సంస్థలతో దగ్గరగా ఉండే నాయకులకు పగ్గాలు అప్పగించింది కేంద్ర నాయకత్వం. ఇప్పటికే తెలంగాణలో అధికారపార్టీకి ప్రత్యామ్నాయం మేమేనంటున్న BJP.. ఏపీలోనూ TDP స్థానాన్ని ఆక్రమిస్తామంటోంది. మరి కమలనాధులకు నిజంగా అంత బలముందా? వారి వ్యూహమేంటి? తెలుగురాష్ట్రాల్లో అడపాదడపా సీట్లు వస్తున్నాయి. రాజకీయంగా ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది బీజేపీ. కానీ సొంతంగా బలోపేతం కావాలన్న కల తీరడం లేదు. గతంలో పొత్తులతో సీట్లు సంపాదించిన పార్టీ.. గడిచిన ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేసి సీట్లు, ఓట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు రావడంతో పార్టీలో ఆశలు చిగురించాయి. ఇటు ఏపీలోనూ టీడీపీ బలహీనపడుతుందని.. దీనిని అనుకూలంగా మలుచుకుని ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆరాటపడుతోంది కమలం.

ఇరురాష్ట్రాలపై దృష్టిపెట్టిన అధినాయకత్వం హిందూ ఎజెండానే నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో హిందూ సంస్థలతో దగ్గరగా ఉండి.. దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఎంపీ సంజయ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఇక్కడకున్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని.. మతరాజకీయాల ద్వారానైనా అధికార TRSకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న కలవైపు అడుగులు వేస్తోంది పార్టీ. సంజయ్‌ కూడా గత కొంతకాలంగా హిందూ అంశాలనే అస్త్రాలుగా చేసుకుని ప్రచారం మొదలుపెట్టారు. సంఘ్‌ పరివారంతో కలిసి హిందూ సంస్థలన్నీ ఏకం చేసేపనిలో ఉన్నారు సంజయ్‌.

అటు ఏపీలో వలసనాయకులపై నమ్మకం పెట్టిన పార్టీ అక్కడ కూడా మూలసిద్దాంతం వైపే వచ్చింది. వలస నాయకులతో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని భావించిన నాయకత్వం పార్టీ పగ్గాలు మార్చి.. సోము వీర్రాజుకు కట్టబెట్టింది. లాయల్టీ, పరివారంతో అనుబంధం ఉన్న వీర్రాజుకు మొదటినుంచి దూకుడుగా ఉంటారన్న ప్రచారముంది. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నా.. తన భిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పిన ముక్కుసూటితనం ఉన్న నాయకుడు. పార్టీ విధానాలను బలంగా తీసుకెళ్లి.. కాషాయాన్ని బలోపేతం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారు. సామాజికవర్గం కూడా ఆయనకు అనుకూలంగా మారింది.

ఇంతకాలం తోకపార్టీగానే ముద్ర పడ్డా కమలనాథులు.. 2024లో రెండు రాష్ట్రాల్లో సొంతంగా సత్తా చాటాలని చూస్తోంది. మరి కొత్త నాయకుల తమదైన ఎజెండాతో బలం చూపిస్తారా? ఇందులో వలస నేతలు సర్ధుకుని కాషాయంలో కలుస్తారా? సైలెంట్‌గా తప్పుకుంటారా? వీటికి కాలమే పరిష్కారం చెప్పాలి.

ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి వచ్చిన ఓట్లు… సీట్లు 1985లో బీజేపీ పోటీచేసిన స్థానాలు 10 గెలిచింది 8, వోట్‌ షేర్‌ 1.32శాతం 1989లో 12 చోట్ల పోటీచేసి గెలచింది 5 వోట్‌ షేర్‌ 1.78శాతం 1994లో 280 చోట్ల పోటీచేసింది గెలిచిన సీట్లు 3, వోట్‌ షేర్‌ 3.89శాతం 1999లో 24 చోట్ల పోటీచేసిన పార్టీ గెలిచిన సీట్లు 12, వోట్‌ షేర్‌ 3.67శాతం 2004లో 27 చోట్ల పోటీ చేసింది 2 మాత్రమే గెలిచిన పార్టీ. వోట్‌ షేర్‌ 2.63శాతం 2009లో 271 చోట్ల పోటీ చేసిన పార్టీ గెలిచింది 2, వోట్‌ షేర్‌ 2.84శాతంఔ

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన ఓట్లు సీట్లు 2014లో బీజేపీ గెలిచిన సీట్లు 5 వోట్‌ షేర్‌ 7.1శాతం 2018లో ఒంటరిగా పోటీచేసిన పార్టీ గెలిచింది ఒక్కటే సీటు. వోట్‌ షేర్‌ 7.1శాతం 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో 17 చోట్ల పోటీ గెలిచిన సీట్లు 4 , వోట్‌ షేర్‌ 23.53శాతం

విభజన అనంతరం ఏపీలో సీట్లు ఓట్లు… 2014లో టీడీపీతో పొత్తు గెలిచిన స్థానాలు 4, వోట్‌ షేర్‌ 4.2శాతం 2019లో ఒంటరిగా పోటీచేసిన పార్టీ గెలిచిన సీట్లు జీరో. వోట్‌ షేర్‌ 0.84 మొత్తం వచ్చిన ఓట్లుఎ 2,63,849

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో