Zodiac Signs: జీవితాంతం మనతో ఉండాలని కోరుకున్నవారే మనల్ని మోసం చేస్తే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు, చెడు వ్యసనాలు, దిండు పట్టుకుని ఏడవడం వంటివి జీవితంలో భాగంగా మారిపోతాయి. అయితే జ్యోతిష్యం ప్రకారం ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. అదేమిటంటే.. కొన్ని రాశులవారు చంచల స్వభావం కలిగి ఉంటారు. ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేస్తుంటారు. అలాంటి వారు మీ ప్రేమను క్షణిక కాలంలోనే కాదని వదిలేయగలరు. సందర్భం ఏదైనా, తప్పు ఎవరిదైనా మీ మాటలను కాక ఇతరుల సానుభూతితో చెప్పే మాటలపైనే విశ్వాసం చూపిస్తారు. అన్ని వేళ్లో అది వారి తప్పు అనలేము కానీ వారిపై గ్రహాల ప్రభావమని చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశులకు చెందినవారితో ప్రేమలో పడినా, వారిని గుడ్డిగా నమ్మినా ఏదో ఓ రోజు మీ మనసు గాయపడక తప్పదు. అలాంటి పరిస్థితులే ఎదురైతే ముందుగానే సన్నద్ధమై ఉండడం మంచింది. ఇంతకీ ఎదుటివారి గుండెను గాయపరచగల స్వభావం కలిగిన ఆ రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..
ధనుస్సు రాశి: ఈ రాశిలో జన్మించినవారికి ఇతరులను గాయపరచాలనే ఆలోచన ఉండదు కానీ అనుకోకుండా లేదా తప్పని పరిస్థితుల్లో ప్రేమించినవారిని కాదని వెళ్లిపోతారు. కొత్త విషయాలను తెలుసుకోవాలి, కొత్తవారితో స్నేహం ఏర్పరుచుకోవాలనే కోరిక అమితంగా ఉన్నందున కూడా వారు మీ నుంచి దూరం కాగలరు. ముఖ్యంగా వీరిలోని స్వేచ్చాస్ఫూర్తి బంధనంగా ఉండే బంధాలను వద్దని వెళ్లిపోయేలా చేస్తుంది.
మిధునం: మిధున రాశివారు కూడా ఇతరుల మనసులను గాయపరచగలరు. ఇది వారి ఉద్దేశ్యం కాదు కానీ ఇతరులపై తేలికగా విసుగు చెంది, వారికి దూరం కావాలనుకుంటారు. ఈ క్రమంలోనే ప్రేమించినవారిపై కూడా ఒకనొక సమయంలో విసుగు చెంది వారిని కాదని వెళ్లిపోతారు. కానీ ఏదైనా బంధంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మెలుగుతారు.
కుంభ రాశి: స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కుంభరాశివారు పరితపిస్తుంటారు. బంధనం అనిపించే ఏ బంధం నుంచి అయినా బయటపడేందుకు సిద్ధపడతారు. వీరిలో నిబద్ధత, విధేయత స్వభావం ఉన్నప్పటికీ కొంతవరకే కష్టాలను సహించగలరు. తాము ప్రేమించిన వ్యక్తి సరైనవారు కాదని అనుకున్న మరుక్షణమే ఆ బంధానికి స్వస్తి పలుకుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..