వార ఫలాలు (డిసెంబర్ 31, 2023 నుంచి జనవరి 6, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతారు. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఏర్పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతారు. చేపట్టిన పనులు నిరాఘాటంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడ తాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కానీ, వృథా ఖర్చుల మీద అదుపు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. వృత్తి జీవితంలో బిజీ అవుతారు. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైన ఎటు వంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. కుటుంబపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలను వాయిదా వేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతు న్నప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమా చారం అందుతుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. సోదరుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలనిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబంలో సామరస్యం పెరుగు తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబ సభ్యులతో కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సతీమణితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఎవరికైనా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం ప్రస్తుతానికి శ్రేయస్కరం కాదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సా హంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్ని సకాలం పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపా రాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు అధికారులకు బాగా నచ్చుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. దైవ కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు కొద్దిగానే ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాద లకు లోటుండదు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. పెద్దల సలహాలు, సూచనలతో వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేయడం జరుగు తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. విమర్శలు, ఆరోపణలను పట్టించు కోవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సైతం సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. రుణాలు చాలావరకు తీర్చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన లాభాలు అందుకుంటారు. తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు మంచి మలుపు తిరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశిం చిన శుభ వార్తలు అందుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరు ద్యోగులు అప్రయత్నంగా మంచి అవకాశాలు అందుకుంటారు. పిల్లలు గానీ, తల్లితండ్రులు గానీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలను ఆర్జిస్తారు. అవసర సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో కార్యకలా పాలు బాగా పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా, ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు తీసుకు వస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఇంటా బయటా మాటకు, చేతకు విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కొన్ని వ్యక్తిగత విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవా నుగ్రహంతో ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్య మైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండ డం మంచిది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అను కోకుండా శుభవార్తలు వింటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. అయితే, ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యో గాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అంది స్తారు. స్త్రీ మూలక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బుండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రుల విషయంలో అప్ర మత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విలాసాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది.