Weekly Horoscope (25 June -01 July 2023): వారి ఆదాయం అంచనాలు మించి పెరుగుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు..

| Edited By: Aravind B

Jun 25, 2023 | 5:01 AM

Weekly Horoscope (25 June -01 July 2023): జ్యోతిష్య శాస్త్రం మేరకు ఈ వారం అంటే ఆదివారం (జూన్ 25వ తేదీ) నుంచి శనివారం (జులై 1) వరకు మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఎవరికి సానుకూల వాతావరణం నెలకొంటుంది? ప్రేమ వ్యవహారాలు ఎవరికి సానుకూలంగా ఉంటాయి? 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope (25 June -01 July 2023): వారి ఆదాయం అంచనాలు మించి పెరుగుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు..
Weekly Horoscope 25th June 01st July 2023
Follow us on

Weekly Horoscope (25 June -01 July 2023): జ్యోతిష్య శాస్త్రం మేరకు ఈ వారం అంటే ఆదివారం (జూన్ 25వ తేదీ) నుంచి శనివారం (జులై 1) వరకు మీ రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఎవరికి సానుకూల వాతావరణం నెలకొంటుంది? ప్రేమ వ్యవహారాలు ఎవరికి సానుకూలంగా ఉంటాయి? 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగపరంగా, ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పను లన్నీ పూర్తి అవుతాయి. ఒక పథకం ప్రకారం కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఒత్తిడి బాగా తగ్గు తుంది. ఉద్యోగంలో అధికారులు లేదా యజమా నుల నుంచి ఆశించినంతగా ప్రోత్సాహం లభి స్తుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విలాసాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేసే అవ కాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఒక చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు ఇది చాలావరకు అనుకూల సమయం. ఉద్యోగ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా సామరస్యంగా ముందుకు సాగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి ఉద్యోగాలలో ఆశించడం దానికంటే ఎక్కువగా పురోగతి కనిపిస్తుంది. హోదా పరంగా ఆర్థికపరంగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు అంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది. దాంపత్య జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలపరంగా వారం అంతా ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది కానీ కుటుంబ జీవితంలో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. చిన్నపాటి ప్రయత్నం అయినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారిపోతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలను వినడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి లేదా పని భాగం పెరుగుతుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, కొంతవరకు కుటుంబ పరిస్థితి అనుకూలంగానే ఉంటాయి కానీ వృత్తి, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సహ చరుల నుంచి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. దాంపత్య జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): డాక్టర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారి వారి వృత్తులలో వారు బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో కలిసి విలాస జీవితం మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన దాని కంటే ఎక్కువగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. దూర ప్రాంతాల నుంచి మంచి సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొద్దిగా లాభాలు తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థిక పరిస్థితి యధాతధంగా కొనసాగుతుంది. ప్రస్తు తానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం అంత శ్రేయ స్కరం కాదు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ వారం అంతా సుఖ సంతోషాలతో సాగి పోతుంది. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. సరైన ప్రయత్నాలతో ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే జీవితానికి అంత మంచిది. ధనవృద్దికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలలో లాభాల శాతం బాగా పెరిగే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాలు వితరణ కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంపొందే సూచనలు ఉన్నాయి.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి ఉద్యోగాలపరంగా ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు కూడా పురో గతి సాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. ఆరోగ్యం నిలకడగా కొనసాగు తుంది. మిత్రులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. జీవితం మలుపు తిరిగే శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కెరియర్ పరంగా కొద్దిగా ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ వారం ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంత రించుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు బాగా తగ్గించుకొని పొదుపు పాటించే అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. అవిశ్రాం తంగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నిలకడగా లాభాలు కొనసాగుతాయి.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి అవ కాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. డబ్బులు ఇవ్వాల్సిన వారు తీసుకువచ్చి ఇస్తారు. శుభకార్యాల మీద లేదా పుణ్యకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. కోప తాపాలను కూడా తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..