Weekly Horoscope: వారు ఏ పని తలపెట్టినా సఫలం అవుతారు.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (నవంబర్ 12 నుంచి నవంబర్ 18, 2023 వరకు): మేష రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు తప్పకుండా శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వారు ఏ పని తలపెట్టినా సఫలం అవుతారు.. 12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 12 18 November 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 12, 2023 | 6:34 AM

వార ఫలాలు (నవంబర్ 12 నుంచి నవంబర్ 18, 2023 వరకు): మేష రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు తప్పకుండా శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రాశ్యధిపతి కుజుడిని గురువు వీక్షిస్తున్నందువల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. సరైన ప్రయత్నాలు, నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవ కాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహ కారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశిం చిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగు లకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కొందరు ఇష్టమైన, సన్నిహితులైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి ఒక శుభ వార్త వింటారు. కుటుంబసమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు, శని, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యో గాలలో సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయ పడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

చతుర్థ స్థానంలో రవి, కుజులు కలిసి ఉండడం వల్ల, గురువు దశమ స్థాన సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి సానుకూల స్పందన లభించవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. సమయం కాస్తంత అను కూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సతీమణికి అనుకూలంగా ఉంటాయి.

కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2) ధన స్థానంలో రవి, కుజుల సంచారం, రాశిలో ధనాధిపతి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురు, బుధ, శనీశ్వరుల శుభ సంచారం కారణంగా ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయంగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్ర గానీ, విహార యాత్ర గానీ చేయడం జరుగుతుంది. ఉద్యోగం మారడం గానీ, ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవడం గానీ జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశిలో బుధుడి సంచారం, లాభస్థానంలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని శుభవార్తలు వినడం, ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. రావ లసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తృతీయ స్థానంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం చేస్తున్నందువల్ల సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాకుండా సామాజికంగా కూడా సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

దాదాపు ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అందివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెళ్లి సంబంధం విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

నవమ, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయ త్నాలు సానుకూలపడతాయి. నిత్య జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహి స్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక కార్యక్రమంలో ఇష్టమైన వారిని కలుసు కుంటారు. దూర ప్రయాణాలను చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కొందరు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు ధన స్థానంలో బలంగా సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక విషయాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ముఖ్యమైన సమస్యలను అధిగమించి అధికారులకు దగ్గరవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబసమేతంగా ఆల యాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్, షేర్లకు దూరంగా ఉండడం మంచిది. సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అను కూలంగా ఉంది. ఆశించిన సమాచారం అందుతుంది. ఈ రాశిలో రాహువు ప్రవేశించినందువల్ల వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. పరిచయస్థుల కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.