
Kanya Rashi 2026 Horoscope: కొత్త సంవత్సరంలో మొదటి ఆరు నెలలు గురువు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారికి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, బాగా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, ఆస్తి వివాదాలు కూడా సానుకూలపడతాయి. సప్తమ స్థానంలో శని వల్ల ప్రతి పనీ కొద్దిగా ఆలస్యం కావడం తప్ప నష్టమేమీ జరగదు. మొత్తం మీద ఈ రాశివారికి మొదటి ఆరు నెలలు బాగానే గడిచిపోతాయి. అయితే, ద్వితీయార్థంలో గురువు లాభ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల జీవితం జూన్ నుంచి డిసెంబర్ వరకు నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఆదాయం పెరగడం, పదోన్నతులు లభించడం, గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి.
సంవత్సరమంతా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ద్వితీయార్థంలో కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ఆరవ స్థానంలో శనీశ్వరుడు, జూన్ నుంచి లాభ స్థానంలో గురువు ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. దాదాపు ఏడాదంతా ఈ రాశివారికి సంతృప్తికరంగా గడిచిపోతుంది. మే చివరి వరకు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా కొద్దిగా అనుకూలతలను అనుభవించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలున్నాయి.
జూన్ వరకు వీరు ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆ తర్వాత సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. జూలై నుంచి నవంబర్ లోగా మంచి కుటుంబంతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. జూలై తర్వాత సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబ, వైవాహిక జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ ఏడాదంతా వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల మధ్య మధ్య అనారోగ్యాలు తప్ప కపోవచ్చు. ఆరవ స్థానంలో ఉన్న రాహువు వల్ల ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. తీర్థయాత్రలు, విహార యాత్రలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు ప్రస్తుతానికి శ్రమ తప్పకపోవచ్చు. జూన్ మాత్రం వారు రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ఈ రాశివారికి గురు, శని, రాహువుల బలం వల్ల దాదాపు ఏడాదంతా అనుకూలంగా సాగిపో తుంది. ఆదాయంలో దిన దినాభివృద్ధి ఉండడంతో పాటు ఉద్యోగపరంగా కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. మే, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో తీర్థయాత్రలు, విహార యాత్రలతో పాటు విదేశీ యాత్రలకు కూడా బాగా అవకాశం ఉంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగు తాయి. జూలై, నవంబర్ నెలల మధ్య సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది.