గ్రహాల సంచారం మనిషి జాతకంపై ప్రభావం చూపిస్తుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి గ్రహాలు అడుగు పెట్టిన సమయంలో కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాల ప్రభావంతో కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని రాశులకు కష్ట, నష్టాలను కలుగజేస్తుంది. నవ గ్రహాల్లో కొన్ని గ్రహాలు త్వరగా రాశుల గమనాన్ని మార్చుకుంటే… కొన్ని గ్రహాలు ఏళ్లకు ఏళ్లు తీసుకుంటాయి. ఇక తొమ్మిది గ్రహాల్లో ఒకటైన శుక్ర గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో విశేష స్థానం ఉంది. రాక్షస గురువు శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు అధినేతగా భావిస్తారు. అందుకనే శుక్రగ్రహ సంచారం చేసిన సమయంలో అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఈ నెల 12వ తేదీన తెల్లవారు జామున 4.40 గంటలకు శుక్రుడు రాశిని మార్చుకోనున్నాడు. ధనుస్సు రాశు నుంచి మకర రాశిలోకి అడుగు పెట్టనున్నాడు.
ఇప్పటికే మకర రాశిలో సూర్యుడు, కుజులు సంచరిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తేదీన శుక్రుడు మకర రాశిలో ఈ గ్రహాలతో కలవ నున్నాడు. దీంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుందని, లాభాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు లక్ష్మీ నారాయణ యోగం వలన లాభాలను అందుకునే రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు లక్ష్మీ నారాయణ యోగ ప్రభావంతో అన్నింటా శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ విషయంలో సక్సెస్ అందుకోనున్నారు. అంతేకాదు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు పరిష్కారం కూడా లభించనుంది. ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. ఉద్యోగ, వ్యాపార , వృత్తి పరమైన ఇబ్బందులు తీరి ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు.
మిథున రాశి: ఈ రాశి వ్యక్తులకు ఈ యోగం కారణంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త అవకాశాలను అందుకుని సక్సెస్ వైపు అడుగులు వేస్తారు. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పనులైనా పనులైనా ఖచ్చితత్వంతో చేయగలుగుతారు.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు లక్ష్మీనారాయణ యోగంతో సంపద రెట్టింపు అవుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ప్రేమ విషయంలో సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్త వినే అవకాశం ఉంది. సుఖవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడపనున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ లక్ష్మీ నారాయణ యోగం ప్రభావం శుభ ప్రదంగా ఉండనుంది. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అంతేకాదు సమాజంలో గౌరవంతో పాటు కీర్తి, ప్రతిష్టలను అందుకుంటారు. ఎటువంటి పనులు మొదలు పెట్టినా ఆటంకాలు ఏర్పడకుండా సులభంగా పూర్తి చేస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు