శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం 2, వ్యయం 14 | రాజపూజ్యాలు 5, అవమానాలు 3
మార్చి 29తో అర్ధాష్టమ శని తొలగిపోతున్నందువల్ల కొన్ని కష్టనష్టాల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకో వడం మొదలవుతుంది. మే 18న రాహువు నాలుగవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ, ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
మే 25 తర్వాత గురువు అష్టమ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా సమస్యాత్మకంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఈ రాశివారు నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవలసి ఉంటుంది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరు గుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
ఈ రాశివారికి మే నెల మొదటి నుంచి జీవితంలో సానుకూల మార్పులు రావడం మొదలవు తుంది. మే తర్వాత గురువు అష్టమ స్థానంలోకి మారుతున్నప్పటికీ, వీరి ఆదాయానికి లోటుం డదు. కుటుంబంలో మరింత ఎక్కువగా శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. జూలై తర్వాత ఆదాయ వృద్ది ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. మంచి వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఒక వెలుగు వెలుగుతారు. అన్ని విధాలా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఈ రాశివారు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.