Ugadi 2025 Astrology: ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే..! జీవితంలో ఇక మొట్టు పైకి..

| Edited By: Janardhan Veluru

Mar 24, 2025 | 7:08 PM

Telugu Astrology: ఉగాది పంచాంగం 2025 ప్రకారం కొన్ని రాశుల వారికి రాజపూజ్యాలు అధికంగా ఉన్నాయి. కొన్ని రాశుల వారికి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యంపై ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి రాశికి సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలు ఇక్కడ ఉన్నాయి.

Ugadi 2025 Astrology: ఈ రాశులకు అన్నీ రాజపూజ్యాలే..! జీవితంలో ఇక మొట్టు పైకి..
Ugadi 2025 Astrology
Follow us on

Ugadi 2025 Panchangam: ఉగాది పంచాంగంలోని కందాయ ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి రాజపూజ్యాలు, కొన్ని రాశుల వారికి అవమానాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. గ్రహాల స్థితిగతులను బట్టి రాజ పూజ్యాలను, అవమానాలను లెక్కగట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్, ప్రముఖులతో పరిచయాలు, సత్కారాలు, ప్రయత్న లాభం వంటి సానుకూల ఫలితాలన్నీ రాజపూజ్యాల కిందకు వస్తాయి. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, జీతభత్యాలు పెరగకపోవడం, పదోన్నతులు లభించకపోవడం, అనారోగ్యాలు వంటి ప్రతికూల ఫలి తాలు అవమానాల కిందకు వస్తాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉన్నందు వల్ల మిథునం, కర్కా టకం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఏడాది పాటు జీవితం వైభవంగా సాగిపోతుందని చెప్పవచ్చు.

  1. మిథునం: ఈ రాశికి ఉగాది తర్వాత నుంచి రాజపూజ్యాలు 4, అవమానాలు 3 అయినందువల్ల ఉద్యోగంలో హోదాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో గుర్తింపు లభించడం వంటివి తప్పకుండా జరు గుతాయి. ఏడాదిపాటు జీవితం నిశ్చింతగా సాగిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగు తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వృథా ఖర్చులతో ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి రాజపూజ్యాలు 7, అవమానాలు 3 అయినందువల్ల ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం, ధన లాభం కలగడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల, ఉద్యోగంలో కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి.
  3. కన్య: ఈ రాశివారికి కందాయ ఫలాల ప్రకారం రాజపూజ్యాలు 6, అవమానాలు 6 అయినందువల్ల ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. అయితే, బాగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎదురు కావచ్చు.
  4. తుల: ఈ రాశివారికి ఉగాది పంచాంగం ప్రకారం రాజపూజ్యాలు 2, అవమానాలు 2 అయినందువల్ల ఉద్యోగ జీవితానికి, వృత్తి, వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆదాయం కూడా సంతృప్తికరంగా సాగిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అయితే, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది.
  5. వృశ్చికం: ఉగాది కందాయ ఫలాల ప్రకారం ఈ రాశివారికి రాజపూజ్యాలు 5, అవమానాలు 3. అందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడం, అనుకున్న వ్యవహా రాలు అనుకున్నట్టు పూర్తి కావడం, ఆదాయం విశేషంగా వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. విదేశీ అవకాశాలు ఒక పట్టాన అందకపోవచ్చు.