Shubha Yoga
కేంద్ర, కోణాల్లో అనుకూల గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు అనుకూల ఫలితాలు మాత్రమే అనుభవానికి వస్తాయి. ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శని, రవి, బుధ గ్రహాలు ఏ రాశికి కేంద్రంలో ఉన్నా, కోణంలో ఉన్న శుభ యోగాలనిస్తాయి. కేంద్ర స్థానాలంటే 1,4,7,10 కాగా, కోణాలంటే 5,9 స్థానాలు. దాని ప్రకారం దాదాపు మూడు నెలల పాటు వృషభం, సింహం, వృశ్చికం, కుంభం, మిథునం, తులా రాశివారికి ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా యోగదాయక కాలమని చెప్పవచ్చు. ఎక్కువ భాగం శుభ వార్తలను మాత్రమే వినడం, శుభ పరిణామాలు అనుభవానికి రావడం, ధన వృద్ధికి, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉండడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశివారికి దశమ కేంద్రంలో శని, రవి, బుదుల సంచారం వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. పదోన్నతికి లేదా తత్సమానమైన హోదాకు అవకాశం ఉంటుంది. సాధారణంగా జీవన శైలిలో, ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. అనేక విధాలుగా శుభ వార్తలు వినడం, ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఈ రాశివారి జీవిత భాగస్వామికి కూడా ధన యోగం పట్టే అవకాశం ఉంటుంది.
- మిథునం: ఈ రాశికి తొమ్మిదవ కోణ రాశి అయిన కుంభంలో మూడు గ్రహాల సంచారం వల్ల విదేశీయాన యోగం ఉంటుంది. తప్పకుండా విదేశీ సొమ్ము తినే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం, విదేశాల్లో స్థిరత్వం సంపాదించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి సహాయ సహ కారాలు అందుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
- సింహం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో రాశ్యధిపతి రవితో సహా మూడు గ్రహాలు కలవడం వల్ల కెరీర్ పరం గానే కాకుండా, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఇతరులకు లబ్ధి చేకూరే పనుల్లో నిమగ్నం అవుతారు. రాజకీయ ప్రవేశం చేయడానికి ఇది అనుకూల సమయం. రాజకీయంగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు ఉండవచ్చు. ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది. అనూహ్యంగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
- తుల: ఈ రాశికి పంచమ కోణంలో రవి, శని, బుధులు కలవడం యోగదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా, ఆర్థికంగా మనసులో ఉన్న కోరికలు కొన్నయినా, కొద్దిగానైనా తప్పకుండా నెరవేరు తాయి. ఏ విషయానికైనా సమయం అనుకూలంగా ఉంది. పనులు, ప్రయత్నాలన్నీ విజయ వంతం అవుతాయి. ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి. ఇతరులకు సహాయం చేయగల స్థాయికి చేరుకుంటారు. అనుకోకుండా సంపద లేదా ఆస్తి కలిసి రావడానికి అవకాశముంది.
- వృశ్చికం: ఈ రాశివారికి చతుర్థ కేంద్రంలో ఈ మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల సంపద బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందడంతో పాటు ఆస్తి కలిసి రావడం కూడా జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
- కుంభం: ఈ రాశికి లగ్న (రాశి) కేంద్రంలో రాశ్యధిపతి శనీశ్వరుడితో సహా మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల తప్పకుండా పదోన్నతికి, అధికార యోగానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. సమా జంలో ఒక ముఖ్యుడిగా చెలమణీ అవుతారు. ముఖ్యంగా ధనపరంగా బలం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు ముగింపు పలుకుతారు.