Foreign Travel Yoga: రాహువు అనుగ్రహంతో ఆ రాశుల వారికి విదేశీయాన యోగం..! అందులో మీ రాశి ఉందా..?

| Edited By: Janardhan Veluru

Jan 10, 2024 | 6:57 PM

ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న రాహువు వల్ల ఈ ఏడాది మే లోపు ఆరు రాశుల వారికి విదేశీయాన యోగం ఏర్పడే అవకాశం ఉంది. మీన రాశి జల రాశి అయినందువల్ల జల ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశీ యానానికి, విదేశీ భాషలకు, విదేశీ సొమ్ముకు కారకుడైన రాహువు విదేశాలకు సంబంధించిన మీన రాశిలో సంచరించడం వల్ల ఆరు రాశుల వారికి తప్పకుండా ‘విదేశీ’ యోగం పట్టడం జరుగుతుంది.

Foreign Travel Yoga: రాహువు అనుగ్రహంతో ఆ రాశుల వారికి విదేశీయాన యోగం..! అందులో మీ రాశి ఉందా..?
Foreign Travel Yoga
Follow us on

ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న రాహువు వల్ల ఈ ఏడాది మే లోపు ఆరు రాశుల వారికి విదేశీయాన యోగం ఏర్పడే అవకాశం ఉంది. మీన రాశి జల రాశి అయినందువల్ల జల ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విదేశీ యానానికి, విదేశీ భాషలకు, విదేశీ సొమ్ముకు కారకుడైన రాహువు విదేశాలకు సంబంధించిన మీన రాశిలో సంచరించడం వల్ల ఆరు రాశుల వారికి తప్పకుండా ‘విదేశీ’ యోగం పట్టడం జరుగుతుంది. ఈ ఆరు రాశులుః వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీనం. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ఈ రాశుల వారు విదేశాలకు వెళ్లడం, అక్కడ స్థిరపడడం కూడా జరిగే అవకాశం ఉంటుంది.

  1. వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు విదేశీయానానికి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు, అక్కడ బాగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది. స్వదేశంలో ఉన్నవారు విదేశీ భాషలను నేర్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. విదేశీ యానానికి ప్రయత్నం చేస్తున్నవారు మే లోపల ఒక్కసారైనా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి విదేశీ సంబంధం ఖాయం అయ్యే సూచనలున్నాయి.
  2. మిథునం: ఈ రాశికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన దశమ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందు వల్ల విదేశీ ఉద్యోగాలకు నిరుద్యోగులు ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. ఉద్యోగరీత్యా ఈ రాశివారు విదేశాలకు వెళ్లడం, అక్కడ శిక్షణ పొందడం వంటివి జరగవచ్చు. ఉన్నత విద్యకు వెళ్లే వారికి అనేక అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగాల కోసం మే లోపున విదే శాలకు వెళ్లగలిగినవారు అక్కడ స్థిరపడిపోవడం జరుగుతుంది. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రాహువు సంచారం వల్ల విదేశీ సొమ్ము అనుభవించే అవకాశం కలుగుతుంది. విదేశీయానానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సునాయాసంగా పరి ష్కా రం అవుతాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి శాశ్వత లేదా స్థిర నివాసానికి అవ కాశం కలుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల తప్ప కుండా మంచి ఫలితం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలకు ప్రయత్నించడం మంచిది.
  4. తుల: ఈ రాశికి సర్వీస్ స్థానమైన ఆరవ స్థానంలో రాహువు సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగం లభించడానికి మంచి అవకాశాలున్నాయి. కొద్ది ప్రయత్నంతో వీరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాల కారణంగా వీరికి తిరుగులేని ధనయోగాలు పట్టడం జరుగుతుంది. రాహువు టెక్నాలజీకి కూడా కారకుడైనందువల్ల ఈ రాశికి చెందిన ఐ.టి, టెక్నాలజీకి సంబంధించిన వారికి విదేశాల్లో స్థిరపడడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంది.
  5. మకరం: తృతీయ స్థానంలో రాహు సంచారం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశీ యానానికి, విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి, విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల కారణంగా ఈ రాశివారికి మంచి ధన లాభం కలుగుతుంది. చదువులు, ఉద్యోగాలకే కాకుండా పర్యాటకులుగా గానీ, అతిథులుగా గానీ వెళ్లే అవకాశం కూడా ఉంది. విద్యా ర్థులు విదేశీ భాషల్లో ప్రావీణ్యం పొందుతారు. విదేశీ సంబంధాలు ఖాయమయ్యే అవకాశం కూడా ఉంది.
  6. మీనం: ఈ రాశిలోనే రాహువు సంచరించడం, ఈ రాశినాధుడు గురువు కూడా చర రాశిలో ఉండడం వల్ల ఈ రాశివారు విదేశీ యానం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలకు మాత్రమే కాకుండా ఉన్నత చదువుల నిమిత్తం కూడా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు తేలికగా వాటిల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. విదేశీ సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంది. విదేశీయానానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోవడం జరుగుతుంది.