ఉద్యోగం చేసే ప్రదేశంలో.. లేదా ఇంట్లో ఎవరో ఒకరు అధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. అయితే సామాన్యంగా కొందరు వృత్తి రీత్యా అధికారాన్ని చూపిస్తే.. మరికొందరు మాత్రం సహజంగానే ఇతరులపై ఎప్పుడూ ఆధిపత్యాన్ని చెలాయించాలని తాపత్రాయపడుతుంటారు. వారు మాట్లాడే విధానంలో.. ఇతరులతో ప్రవర్తించే తీరులో ఇలా ప్రతి చోట లీడర్ అనే భావనతో ఇతరులు.. తాము చెప్పినట్టుగా చేయాలని భావిస్తుంటారు. అలా ఎప్పుడూ ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తూ..ఆధిపత్యం చూపించాలనుకునే వారు.. నిజానికి వారి రాశి చక్రం ప్రభావం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొందరు వ్యక్తులు.. తమ రాశి చక్రం ఆధారంగా వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అలా కొన్ని రాశుల వారికి ఇతరులపై అధిపత్యం చెలాయించడం ఇష్టముంటుంది. మరి.. వారెవరో చూద్ధామా.
వృశ్చిక రాశి..
ఈరాశి వారు తమ చుట్టు ఉన్న వ్యక్తులపై అధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. వారిపై తమ సత్తా చూపించాలని.. అందరూ తమను లీడర్, బాస్, నాయకుడిగా చూడాలని అనుకుంటారు. ఎల్లప్పుడు ఆధిపత్యం కోసం ఆరాపటడుతుంటారు.
కర్కాటక రాశి..
వీరు ఎప్పుడు ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఆనందిస్తుంటారు. వీరు నాయకుడిగా, బాస్ గా ఎదిగేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఒక్కసారి బాస్ అయితే మాత్రం ప్రజలపై అధికారాన్ని చూపించి సంతోషపడతారు.
వృషభ రాశి..
వీరు ఎక్కువగా ఇతరులపై దయతో ఉంటారు.. కానీ వీరి చేతికి అధికారం వస్తే ఇతరులను ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ తప్పు ఉంటే… వెంటనే ఇతరులను క్షమాపణ అడుగుతారు. కానీ చాలా వరకు వీరు తప్పు చేసినట్లు గ్రహించి క్షమాపణ చెప్పడం అరుదుగా జరుగుతుంది.
కుంభ రాశి..
వీరు కూడా ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. ఎప్పుడూ ఇతరులకు చెడు చేయాలనే ఉద్దేశ్యం ఉండదు.. కానీ.. వీరి నాయకత్వంలో ఎక్కువగా పనులు సజావుగా సాగాలని కోరుకుంటారు. ఆధిపత్యాన్ని చెలాయిస్తారు.. కానీ తామే అధికారులము అనే అహంకారం.. గర్వం వీరిలో తొందరగా వెళ్లిపోతుంది. ఎప్పుడు అధికారాన్ని చెలాయించడానికి మాత్రమే ఇష్టపడతారు.
గమనిక:- ఈ కథనం కేవలం రాశి చక్రం లక్షణాలు.. ఆధ్యాత్మిక వ్యక్తుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది.
Also Read: Keerthy Suresh: ఫాలోవర్లకు ఛాలెంజ్ చేసిన కళావతి.. అదుర్స్ అనిపిస్తున్న కీర్తి సురేష్ వీడియో..
Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..
Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..