Telugu News Astrology These 6 Zodiac Signs May See New Career, Job and Income Opportunities Before October 31
నెల రోజుల్లో వీరి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూల స్థితి, శని గ్రహంపై శుభ గ్రహాల దృష్టి కారణంగా అక్టోబర్ 31 వరకు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. ముఖ్యంగా ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు రావచ్చు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది.
శుభ గ్రహాలైన గురు, బుధ, శుక్రులు ఉచ్ఛ, స్వక్షేత్రాలతో ఉండడంతో పాటు మీనంలో ఉన్న శనిని గురు, బుధులు వీక్షించడం వల్ల అక్టోబర్ 31 లోగా వృషభం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, ఆదాయ వృద్ధి విషయంలో కూడా కొత్త అవకాశాలు, మార్గాలు లభించే అవకాశం ఉంది. కొందరి జాతకాల్లో తప్పకుండా మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి సమీప భవిష్యత్తులో వారి కలలు సాకారం అయ్యే అవకాశం ఉంది. అభివృద్ధికి సంబంధించిన అవకాశాల విషయంలో గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది.
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడి సంచారం, భాగ్య స్థానం మీద గురువు దృష్టి వల్ల ఈ రాశివారికి ఉద్యోగావకాశాలతో పాటు ఆదాయ వృద్ధి అవకాశాలు కూడా బాగా పెరుగు తాయి. అక్టోబర్ 31 లోపు ఈ రాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి విదేశీ సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. జీవనశైలి మారిపోయే అవకాశం ఉంది.
మిథునం: దశమ స్థానంలో ఉద్యోగు కారకుడైన శని సంచారం చేస్తుండడం, దశమ స్థానాధిపతి గురువు దన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగపరంగా అనేక అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇతర సంస్థల నుంచి ఆశించిన ఆఫర్లు లభిస్తాయి. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
కర్కాటకం: ఈ రాశిలో దశమాధిపతి కుజుడు, భాగ్యాధిపతి గురువు యుతి చెందడంవల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలతో సహా ఆదాయ వృద్ధికి అనేక మార్గాలు అందు బాటులోకి వస్తాయి. ఉద్యోగులు ఉద్యోగరీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
తుల: ఈ రాశికి శని, గురువుల అనుకూలతతో పాటు, రాశ్యధిపతి శుక్రుడు కూడా జనవరి 2 వరకు స్వస్థానంలో అనుకూలంగా ఉన్నందువల్ల పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ జీవి తం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం, పదోన్నతి లభి స్తాయి. కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వంలో ఉద్యోగం లభించవచ్చు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.
ధనుస్సు: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, దశమ, లాభ స్థానాల్లో బుధ, శుక్రులు సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయ వృద్ధి అవకాశాలు, ఉద్యోగావకాశాలు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కూడా సక్సెస్ అవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవ డంతో పాటు అక్కడే స్థిరపడడం కూడా జరుగుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు, భాగ్యం స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడు, దశమంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడు అక్టోబర్ చివరి లోగా కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉంది. ఈ రాశివారికి సరికొత్త ఉద్యోగావకాశాలు, ఆదాయావకాశాలు ఇబ్బడిముబ్బడిగా కలిసి వస్తాయి. అధికార యోగం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభి స్తుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి.