Zodiac Signs: ఈ 5 రాశులవారికి తొందర్లోనే పెళ్లి యోగం.. ఏయే రాశులంటే.!

|

Jan 03, 2022 | 9:28 AM

కొత్త ఏడాదిని చాలామంది ఎన్నో ఆశలతో స్వాగతించారు. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొందరు ప్రణాళికలు సిద్దం చేసుకుంటే..

Zodiac Signs: ఈ 5 రాశులవారికి తొందర్లోనే పెళ్లి యోగం.. ఏయే రాశులంటే.!
Zodiac Signs
Follow us on

కొత్త ఏడాదిని చాలామంది ఎన్నో ఆశలతో స్వాగతించారు. లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కొందరు ప్రణాళికలు సిద్దం చేసుకుంటే.. మరికొందరు పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరుణంలో జోతిష్యశాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో 5 రాశులవారికి తొందర్లోనే పెళ్లి యోగం ఉందట. మరి ఆ రాశులు ఏంటి.? అందులో మీరున్నారా.? అనేది తెలుసుకుందాం.

మేషరాశి:

ఈ రాశివారికి 2022వ సంవత్సరం అదృష్టం తెచ్చిపెడుతుందని చెప్పాలి. మీరు ఒంటరిగా ఉండి.. చాలాకాలం నుంచి పెళ్లి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లయితే.. ఈ ఏడాది దానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. తమకు నచ్చిన భాగస్వామితో పెళ్లి యోగం తొందర్లోనే ఉంది.

వృషభరాశి:

ప్రస్తుతం ఒంటరిగా ఉంటూ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ఈ రాశివారికి ఈ ఏడాదిలో సకల సంతోషాలు కలుగుతాయి. 2022వ సంవత్సరంలో మీ పెళ్లి ఫిక్స్ కావడంతో పాటు జరిగే యోచనలు కూడా కనిపిస్తున్నాయి.

ధనుస్సురాశి:

ఈ ఏడాది ధనుస్సు రాశివారికి చాలా మంచిది. వివాహానికి ఉండే ఆటంకాలన్ని కూడా తొలగిపోతాయి. అలాగే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన వారి వైవాహిక జీవితం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సమస్యలన్ని దూరమవుతాయి.

మకరరాశి:

ఈ రాశివారికి 2022లో వివాహ నిరీక్షణకు తెరపడుతుంది. మే-జూలై మధ్యకాలంలో వీరికి పెళ్లి యోగం ఉంది. నచ్చిన వ్యక్తితో మూడడుగులు వేస్తారు. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే వివాహితులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచిది.

కుంభరాశి:

ఈ రాశివారు ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే.. మీ బంధం బలపడటమే కాకుండా.. తొందర్లోనే పెళ్లికి తేదీని కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఒకవేళ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే.. ఈ ఏడాది చివరి నాటికి జరుగుతుంది. ఇక పెళ్లి చేసుకున్న జంటలకు ఈ ఏడాది అత్యత్భుతంగా ఉంటుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.