Solar Eclipse: కొత్త ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి అశుభం, ఎన్నో సమస్యలు తెస్తుంది.. అవి ఏమిటంటే

|

Dec 24, 2024 | 8:24 AM

2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం కొత్త సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం కానుంది. అయితే గ్రహణ విషయంలో హిందువులకు కొన్ని నమ్మకాలున్నాయి. ఇక ఈ సూర్య గ్రహణం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం ఏ రాశులపై కనిపిస్తుందో తెలుసుకుందాం.

Solar Eclipse: కొత్త ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి అశుభం, ఎన్నో సమస్యలు తెస్తుంది.. అవి ఏమిటంటే
Solar Eclipse
Follow us on

2024 సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త సంవత్సరం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. 2025 సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి. మనం 2025 సంవత్సరంలో సంభవించే రెండు మొదటి సూర్య గ్రహణం చైత్ర మాసంలోని కృష్ణ పక్షం అమావాస్య తిథి రోజున ఏర్పడనుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో శుభ కార్యాలను, పూజలను నిర్వహించరు. 2025 సంవత్సరం మొదటి సూర్యగ్రహణం మార్చి 29 తేదీ, మధ్యాహ్నం 2:20 గంటలకు సంభవిస్తుంది. ఈ గ్రహణం సాయంత్రం 6:16 గంటల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం మూడు రాశుల వారికి అ శుభాలను కలుగజేస్తుంది. ఈ రోజు ఆ మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి: ఈ సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం మేషరాశిపై కనిపిస్తుంది. ఈ కాలంలో మేష రాశి వారికి ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఈ కాలంలో ఉద్యోగస్తులు తమ ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టవద్దు. దీనితో పాటు మేష రాశి వారు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అజాగ్రత్తగా ఉండకండి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి కెరీర్‌లో సమస్యలు ఎదురవుతాయి. ఆఫీసులో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజువారీ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. పిల్లలతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో డబ్బు, పెట్టుబడికి సంబంధించి ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ కాలంలో చేసిన పొదుపు డబ్బులు వినియోగించాల్సి ఉంటుంది.ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మీన రాశి: మీన రాశి వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు కలగచ్చు. ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టవద్దు. ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకోవద్దు. ఆఫీసులో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు కారణంగా చేపట్టిన పనుల్లో కొన్ని ఆగిపోవచ్చు లేదా చెడిపోవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.