ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు రవి గ్రహం కన్యారాశిలో సంచరించడం జరుగుతోంది. సాధా రణంగా రవి గ్రహం ఏదైనా రాశికి 3,6,10,11స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అత్యుత్తమ ఫలితాల నిస్తాడు. 2,5,9 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఉత్తమ ఫలితాలనిస్తాడు. అదే విధంగా, 1,4,7 స్థానాలలో ప్రవేశించినప్పుడు మధ్యమ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఇక 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు అధమ ఫలితాలనిస్తాడు. మొత్తం మీద రవి గ్రహ కన్యారాశి సంచారం వల్ల ఏడు రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది. రవి సంచారం ఏయే రాశుల వారికి ఏయే విధంగా ఉండబోతోందో ఇక్కడ పరిశీలిద్దాం.
మేషం: ఈ రాశివారికి రవి గ్రహం ఆరవ స్థానంలోకి రావడం జరుగుతుంది. దీనివల్ల శత్రు, రోగ, రుణ సమ స్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అతి వేగంగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది.అయితే, కొద్దిగా అధికారులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వపరంగా కొద్దిగా సమస్యలు తలెత్త వచ్చు.అంతేకాక, తండ్రితో అకారణ వైరం ఏర్పడుతుంది. ప్రభుత్వోద్యోగులు బాగా లాభపడతారు.
వృషభం: ఈ రాశివారికి రవి పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ప్రతిభా పాటవాలకు సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. వీరి ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. సంతానం లేని వారికి సంతాన యోగం పట్టడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు బాగా లాభాలు తెచ్చి పెడతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.
మిథునం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో రవి ప్రవేశం వల్ల గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పడే అవకాశం ఉంటుంది. స్థాన చలన సూచనలున్నాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇల్లు మారే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. సోదరుల కారణంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో బాగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకు చదువుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
కర్కాటకం: ఈ రాశివారికి తప్పకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగానికి అవకాశం ఉంది. అన్ని అంశాల్లోనూ శీఘ్రగతిన పురోగతి ఉంటుంది. పట్టు దల, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. సాహస కృత్యాలకు ఒడిగడతారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహ కారాలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
సింహం: ఈ రాశినాథుడైన రవి ధన స్థానంలో ప్రవేశించినందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వీరి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి, పిల్లలకు అంచ నాలకు మించిన పురోగతి ఉంటుంది. దానధర్మాలు పెరుగుతాయి. సహాయ కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా నచ్చుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయి మనశ్శాంతి ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కన్య: ఈ రాశిలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి మధ్య మధ్య చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. బాగా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆదాయం కొంత వరకు తగ్గుతుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుం టుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాక ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి, విశ్రాంతి కూడా లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు మిత్రుడో ఎవరు శత్రువో అర్థం కాకుండా ఉంటుంది.
తుల: ప్రభుత్వపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. అనుకోకుండా తండ్రితో వైరం ఏర్పడుతుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. డాక్టర్లు, న్యాయ వ్యవస్థకు చెందిన వారు బాగా పురోగతి చెందుతారు. అనవసర ప్రయాణాలతో ఇబ్బంది పడతారు. కొందరు స్నేహి తులు లేదా నమ్మినవారు మోసగించే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారవుతారు. ఇల్లు మారాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఏదో ఒక కారణంగా రావలసిన ప్రమోషన్లు ఆగిపోతాయి.
వృశ్చికం: ఈ రాశివారికి ఏకాదశ స్థానంలో రవి ప్రవేశం వల్ల జీవితంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం తప్పకుండా మలుపు తిరుగుతుంది. అనేక అంశాలలో పురోగతి చెందు తారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆర్థిక పురోగతి కూడా అనుభవానికి వస్తుంది. ఈ రాశివారి వల్ల స్నేహితులకు కూడా మేలు కలుగుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అధికారం చేతికి వచ్చే అవకాశం ఉంది. ఒక పెద్ద వాణిజ్య సంస్థను నిర్వహించే అవకాశం వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు వెనక్కు తగ్గడం, ఈ రాశివారికి ప్రాధాన్యం ఏర్పడడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు అందలాలు ఎక్కుతారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు బాగా లాభపడతారు.
మకరం: ఈ రాశివారికి తొమ్మిదవ స్థానంలో, అంటే భాగ్య స్థానంలో రవి ప్రవేశం వల్ల తండ్రి వారసత్వం లభించడం గానీ, తండ్రి నుంచి ఆస్తి సంక్రమించడం గానీ జరుగుతుంది. అయితే, తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు, విదేశీ అవకాశాలకు వీలుంది. విహార యాత్రలు, తీర్థయాత్రలు చేసే సూచనలున్నాయి. ప్రభుత్వపరంగా డబ్బు గానీ, భూమి గానీ అందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ప్రభుత్వపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలున్నాయి. తండ్రితో గానీ, తండ్రి వైపు వారితో గానీ అకారణ శత్రుత్వం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి.
మీనం: ఈ రాశివారికి 7వ స్థానంలో రవి ప్రవేశం వల్ల కుటుంబ జీవితంలో అపార్థాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇబ్బందులు పడే సూచనలున్నాయి. వ్యాపార భాగ స్వాములతో కూడా సమస్యలు తలెత్తవచ్చు. మీ జీవిత సరళి లేదా పంథా అస్తవ్యస్తం కావచ్చు. తల్లితండ్రులకు దూరమయ్యే అవకాశం ఉంది. కన్యా రాశిలో రవి ఉన్న సమయంలో అనారోగ్యాలు వచ్చే పక్షంలో అవి సుదీర్ఘ కాలం పాటు పీడించే అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల నష్టపోతారు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.