Sun Transit 2025: మకర రాశిలో రవి ప్రవేశం.. ఇక ఆ రాశుల వారికి మహా యోగాలు..!

| Edited By: Janardhan Veluru

Jan 14, 2025 | 7:12 PM

Telugu Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడమే ఒక విశేషం కాగా.. దాన్ని గురువు వీక్షించడం మరో పెద్ద విశేషం. లగ్నాన్ని గానీ, చంద్రుడిని గానీ, రవిని గానీ గురువు వీక్షించినప్పుడు అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశముంది. కొన్ని రాశుల వారికి శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. దీని కారణంగా ఆదాయం పెరగడం, పదోన్నతులు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది.

Sun Transit 2025: మకర రాశిలో రవి ప్రవేశం.. ఇక ఆ రాశుల వారికి మహా యోగాలు..!
Sun Transit In Makara Rasi
Follow us on

Surya Gochar 2025: మకర రాశిలో రవి గ్రహం ప్రవేశించడమే ఒక విశేషం కాగా, దాన్ని గురువు వీక్షించడం మరో పెద్ద విశేషం. లగ్నాన్ని గానీ, చంద్రుడిని గానీ, రవిని గానీ గురువు వీక్షించినప్పుడు అనేక శుభ ఫలి తాలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. గురువు ధన,, గృహ, పుత్త కారకుడైనందువల్ల తప్పకుండా ఈ అంశాలలో శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకర, మీన రాశులకు తప్పకుండా ఫిబ్రవరి 16 వరకు ఆదాయం పెరగడం, పదోన్నతులు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న రవి మీద ధన స్థానంలో ఉన్న గురువు దృష్టి పడినందువల్ల ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్న తులు లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి తప్పకుండా సంభవిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా అనుకూలతలు పెరుగుతాయి. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి, జీవన శైలిలో మార్పు చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.
  2. వృషభం: ఈ రాశిలో ఉన్న గురువు భాగ్య స్థానంలో ఉన్న రవిని వీక్షిస్తున్నందువల్ల పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాల్లో విదేశీ అవకాశాలు బాగా కలిసి వస్తాయి. తప్పకుండా విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. అనుకోకుండా తండ్రి నుంచి చర, స్థిరాస్తులు లభిస్తాయి. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  3. తుల: ఈ రాశికి లాభాధిపతి అయిన రవి చతుర్థంలో ఉండగా దాన్ని గురువు వీక్షించడం వల్ల కుటుం బంలో అనేక విధాలుగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ కార్యాలకు సంబంధిం చిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటివి జరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజి కంగా కూడా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంది. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందుతుంది.
  4. ధనుస్సు: ధన స్థానంలో సంచారం చేస్తున్న భాగ్యాధిపతి రవిని రాశ్యధిపతి గురువు వీక్షిస్తున్నందువల్ల ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశీ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రవి మీద పంచమ స్థానం నుంచి గురువు దృష్టి పడినందువల్ల అపార ధన లాభం కలుగుతుంది. ప్రభుత్వ మూలక గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్ప కుండా రాజయోగాలు పడతాయి. వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడి లాభాల దిశగా ప్రయాణిస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. మనసులోని ఒకటి రెండు ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  6. మీనం: ఈ రాశికి రవి లాభ స్థానంలో సంచారం చేయడం ఒక విశేషం కాగా, రాశ్యధిపతి గురువు దాన్ని వీక్షించడం మరో విశేషం. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. అనేక విధాలుగా అపార ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు, జీతాల పెరుగుదల చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం, ఆస్తుల విలువ పెరగడం వంటివి జరుగుతాయి.