Shukra Gochar
డిసెంబర్ 29 నుంచి జూన్ 24వ తేదీ వరకు శుక్రుడు కుంభ రాశి నుంచి మిథున రాశి వరకు సంచారం చేయబోతున్నాడు. శుక్రుడు మహిళా పక్షపాతి గనుక కొన్ని రాశుల మహిళలు ఈ సంచారం వల్ల అత్యధికంగా లాభపడబోతున్నారు. జనవరి 28న శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితికి చేరుకున్నప్పుడు మహిళలకు విపరీత రాజయోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం శుక్రుడి అనుకూల సంచారం వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు అత్యధికంగా ధన యోగాలు, అధికార యోగాలు, మరికొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు మిత్ర, స్వక్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేసే అవకాశం ఉన్నందువల్ల మహిళలకు జీవితంలో ఎదురు చూడని శుభ ఫలితాలు అనేకం అనుభవానికి వస్తాయి. సొంతగా, స్వయం కృషితో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదో న్నతులు పొందడం జరుగుతుంది. అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు బాగా అనుకూల రాశుల్లో సంచారం చేయడం వల్ల మహిళలు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువ శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశికి చెందిన మహిళల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆశించిన వ్యక్తితో తప్పకుండా పెళ్లి ఖాయం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలు తప్పకుండా ఉన్నత పదవులు అందుకుంటారు.
- కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశి మహిళల మీద వరాల వర్షం కురిపిస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా తప్పకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. చదువుల్లో కూడా ఈ రాశి బాలికలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. తోటి ఉద్యో గుల కంటే బాధ్యతల నిర్వహణలో చాలా ముందుండే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు అనుకూల స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశివారిని అనేక విధాలుగా అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి జీవితంలో సరికొత్త గుర్తింపు లభించి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి అత్యధికంగా లాభాలార్జిస్తారు. కొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- మకరం: ఈ రాశివారికి అత్యంత శుభుడైన శుక్రుడు కొత్త సంవత్సరం ప్రథమార్థమంతా అనుకూల ఫలితాలను ఇస్తున్నందువల్ల మహిళల జీవనశైలి చాలావరకు మారిపోయే అవకాశం ఉంది. ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. పిల్లలు ఆశిం చిన ఫలితాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- కుంభం: ఈ రాశికి కూడా అత్యంత శుభుడైన శుక్రుడు కుటుంబ సంబంధమైన సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కిస్తాడు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆస్తిపాస్తులు కలిసివస్తాయి.