Raja Yoga
శుక్ర, రవి గ్రహాలు ప్రభుత్వానికి, రాజకీయాలకు, భాగ్యానికి కారకులు. ఈ రెండు గ్రహాలు మేష రాశిలో 25 నుంచి మే నెల 16 వరకు కలిసి ఉంటాయి. వీటి వల్ల లాభపడే రాశులేవనేది పరిశీలించాల్సిన విషయం. ఈ రెండు గ్రహాల కలయిక మేష రాశిలో జరుగుతున్నందువల్ల తప్పకుండా మేష రాశివారు బాగా ప్రయోజనం పొందుతారు. ఇక మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు కూడా రాజకీయంగా, ప్రభుత్వపరంగా, ఆర్థికపరంగా ముందుకు దూసుకుపోయే అవకాశముంది.
- మేషం: ఈ రాశిలో రవి, శుక్రులు కలవడం వల్ల రాజకీయంగా ప్రాబల్యం బాగా పెరుగుతుంది. అన్ని వ్యవహారాల్లోనూ విజయాలు సాధిస్తారు. ప్రభుత్వపరంగా కూడా అనేక లాభాలు, ప్రయోజనాలు సమకూరుతాయి. ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, పోలీసు కేసులు, ఇతర వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా యాక్టివిటీ పెరుగుతుంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు కూడా అవకాశముంటుంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు, ఉచ్ఛ రవి కలవడం వల్ల రాజకీయ జీవితం ఏర్పడే అవకాశ ముంది. ఏ పని తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ప్రభుత్వంలో ఉన్నవారి రాబడి విశేషంగా పెరుగుతుంది. ప్రభుత్వపరంగా ఆస్తులు కలిసి రావడానికి, సత్కారాలు జరగడానికి, గౌరవ మర్యా దలు పెరగడానికి అవకాశముంటుంది. రాజకీయాల్లో ఉన్నవారిని విజయాలు వరిస్తాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఒక్క క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర, రవుల కలయిక జరగడం వల్ల తప్పకుండా రాజకీయ ప్రాధాన్యం, ప్రాభవం కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థిరత్వం లభి స్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వపరంగా హోదా పెరిగే సూచనలున్నాయి. రాజకీయాల్లో ప్రవేశించదలచుకున్నవారికి ఇది బాగా అనుకూల సమయం.
- సింహం: ఈ రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్ఛలో ఉండడం, పైగా రాజకీయ గ్రహమైన శుక్రుడితో కల వడం వల్ల రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం బలపడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఇది యోగదాయక కాలం అవుతుంది. ప్రభుత్వపరంగా అనుకూలతలు పెరుగుతాయి. ఈ రెండు గ్రహాల కలయిక భాగ్య స్థానంలో చోటు చేసుకున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉచ్ఛ రవితో శుక్రుడు కలవడం వల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఒకటి రెండు రాజయోగాలు అనుభవానికి వస్తాయి. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు వరిస్తాయి. అనేక విధాలుగా కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొం టారు. ప్రభుత్వపరంగా ప్రయోజనాలు అందే అవకాశముంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది.
- కుంభం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరిగినందువల్ల, అందులోనూ రవికి ఉచ్ఛపట్టినందువల్ల రాజకీయ అధికారం చేపట్టే అవకాశముంటుంది. రాజకీయాలతో పాటు, సామాజిక సేవలు, ప్రజా సంబంధాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. చిన్న ప్రయత్నం తల పెట్టినా గరిష్ట స్థాయిలో లబ్ధిపొందడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలుం టాయి. అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. యాక్టివిటీ బాగా పెరిగే అవకాశముంది.