నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం.. సూర్యుడి తనయుడైన శనీశ్వరుడు కర్మ ప్రదాత. మానవులు చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కనుక న్యాయాధిపతి అని కూడా అంటారు. గ్రహాల్లో అతి నెమ్మదిగా కదిలే గ్రహం కూడా శనీశ్వరుడే.. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడానికి శనీశ్వరుడు దాదాపు రెండున్నర ఏళ్ల సమయం తీసుకుంటాడు. కనుక శనీశ్వరుడిని మంద గమనుడు అని కూడ పిలుస్తారు. అయితే జ్యోతిషశాస్త్రంపై నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు. చాలా మంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతుంటారు. అయితే మందగమనుడు మంచి పనులు చేసే వారిపై అనుగ్రహం .. చెడు పనులు చేస్తే కష్టాలను ఇస్తాడని నమ్మకం. ముఖ్యంగా శనిశ్వరుడు ప్రతి ఒక్క రాశులోనూ కొన్ని ఏళ్ల పాటు ఉంటూ ఆయా మనుషులు చేసే పనులకు తగిన విధంగ ఫలితాలు ఇస్తుంటాడు.అయితే శనిదేవుడికి అంకితం చేయబడిన శనివారం రోజున చేసే కొన్ని పనులతో శుభ ద్రుష్టితో శుభ ఫలితాలను ఇస్తాడని విశ్వాసం. ఈ రోజున శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం..
శనిదేవుడికిదివ్యంగులు, పేదలు అంటే అమితమైన ఇష్టం కనుక ఆయన అనుగ్రహం కోసం పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయడం వలన అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు