Money
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కుంభ రాశిలో కుజ, శనులు మాత్రమే సంచారం చేస్తాయి. ఇంతవరకూ ఈ పాప గ్రహాలతో కలిసి ఉన్న శుభ గ్రహాలు రాశి మారడంతో ఇవి స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం ఏర్పడింది. నిజానికి ఈ రెండు పాప గ్రహాలు ఏ రాశిలో కలుసుకున్నా ఉత్పాతాలు, ఉపద్రవాలు సృష్టిస్తాయి. అయితే, ప్రస్తుతానికి ఇవి మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి మాత్రం ధన లాభాలు, ధన యోగాలు కలిగించడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు తీసుకు వస్తాయి. ఈ శుభ ఫలితాలు ఏప్రిల్ 23 వరకూ ఏదో రూపేణా అనుభవానికి వస్తుంటాయి.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు లాభ స్థానంలో ఉండడం, పైగా లాభాధిపతి శనితో కలవడం వల్ల మహా భాగ్య యోగం ఏర్పడుతోంది. దీనినే నిపుణ యోగమని కూడా అంటారు. నిరుద్యోగు లకు, ఉద్యోగులకు కూడా మంచి ఉద్యోగావకాశాలు అందుతాయి. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉంటుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో దశమాధిపతి శనితో కుజుడు కలవడమన్నది వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతికి దోహదం చేస్తుంది. తప్పకుండా హోదా పెరుగు తుంది. ఎటువంటి పోటీనైనా ఎదుర్కోగలుగుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ వ్యవహారంలో నైనా విజయాలు సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అవకాశాలు వృద్ధి చెందుతాయి.
- సింహం: ఈ రాశివారికి సప్తమంలో శని, కుజులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా శీఘ్ర పురోగతి ఉంటుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. దానికి తోడుగా అదనపు రాబడి కూడా పెరిగే అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. తీరిక ఉండని పరి స్థితి ఏర్పడుతుంది. అయితే, వాహన ప్రమాదాల విషయంలో, దాంపత్య జీవితం విషయంలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.
- కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో కుజ, శనులు కలవడం అన్నది ఈ రాశివారికి విపరీత రాజయోగం కలి గిస్తుంది. డాక్టర్లు, లాయర్లు, రియల్టర్ల వంటివారికి ఇబ్బడి ముబ్బడిగా రాబడి పెరుగుతుంది. రాజ కీయ నాయకులకు ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. శత్రువుల పైనా, పోటీదార్ల పైనా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి మూడవ స్థానంలో కుజ, శనులు కలవడమన్నది అనేక విధాలైన పురోభివృద్ధికి తోడ్పడుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు అవకాశముంది. వ్యాపారాల్లో సునాయాసంగా లాభాలు గడిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలే కాక, అపా ర్థాలు, విభేదాలకు కూడా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ధనాధిపతి శనితో లాభాధిపతి కుజుడు కలవడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలు అవు తాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. భూసంబంధమైన ఆస్తి విలువ పెరుగు తుంది. ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు సఫలం అవుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు తమ వృత్తి జీవితంలో ఘన విజయాలు సాధిస్తారు. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.