అనుకూలంగా శనీశ్వరుడు, గురువు.. కష్టాలు తొలగి వారు కొత్త జీవితం ప్రారంభించడం పక్కా..!

| Edited By: Janardhan Veluru

Jan 05, 2024 | 6:29 PM

శనీశ్వరుడు, గురువు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఎనిమిది రాశుల వారు ఎటువంటి దుర్భర పరిస్థితుల నుంచయినా కోలుకుని, కొత్త జీవితం ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా చితికిపోయినా, అప్పులపాలయిపోయినా, ఉద్యోగాలు కోల్పోయినా, కూడు, గుడ్డ, గూడుకు ఠికాణా లేకపోయినా వారు సమీప భవిష్యత్తులో బాగా కోలుకోవడం జరుగుతుంది.

అనుకూలంగా శనీశ్వరుడు, గురువు.. కష్టాలు తొలగి వారు కొత్త జీవితం ప్రారంభించడం పక్కా..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్రాలను, రాశులను మారుస్తూ ఉంటాయి. మేషం నుండి మీనం వరకు 12 రాశుల మీద దీని శుభ, అశుభ ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే జ్ఞానానికి కారకుడైన బుధుడు మరో ఐదు రోజుల్లో తన స్థానాన్ని మార్చుకోనున్నాడు.. ఏప్రిల్ 09 బుధవారం రోజున బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు. ఈ రాశికి బృహస్పతి అధిపతి. శుక్రుడు, సూర్యుడు ప్రస్తుతం ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన కొన్ని రాశులవారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఆయా రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Follow us on

శనీశ్వరుడు, గురువు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఎనిమిది రాశుల వారు ఎటువంటి దుర్భర పరిస్థితుల నుంచయినా కోలుకుని, కొత్త జీవితం ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా చితికిపోయినా, అప్పులపాలయిపోయినా, ఉద్యోగాలు కోల్పోయినా, కూడు, గుడ్డ, గూడుకు ఠికాణా లేకపోయినా వారు సమీప భవిష్యత్తులో బాగా కోలుకోవడం జరుగుతుంది. పేదలు, కష్టజీవులు, బడుగు వర్గాలు వంటివారికి కారకుడు, ప్రతినిధి అయిన శనీశ్వరుడు బలంగా ఉన్నందువల్ల ఈ వర్గాలకు ఈ గ్రహం అన్ని విధాలు గానూ చేయూతనివ్వడం జరుగుతుంది. జనవరి నుంచి ఈ అనుకూల సమయం ప్రారంభమైంది. మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు చెందిన ఈ వర్గాలకు బాగా కోలుకుని, మళ్లీ కొత్త జీవితం ప్రారంభించడానికి వీలైన కాలం ప్రారంభమైంది.

  1. మేషం: ఈ రాశివారు ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన కష్టనష్టాల్లో ఉన్నా కొంత ప్రయత్నపూర్వకంగా, కొత్త అప్రయత్నంగా క్రమంగా పైకి రావడానికి, తమ కాళ్ల మీద తాము నిలబడడానికి అవకాశం ఉంది. ముందుగా ఆర్థిక పరిస్థితి చక్కబడడానికి మార్గం లభిస్తుంది. సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంలో మార్పు రావడం ప్రారంభం అవుతుంది. సరైన వైద్యుడు, సరైన చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి శనీశ్వరుడు ఉద్యోగ స్థానంలో స్వస్థానంలో ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో అకారణంగా, కర్మఫలంగా తలెత్తిన సమస్యల నుంచి క్రమంగా విముక్తి లభిస్తూ ఉంటుంది. ముందుగా ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా ఉపశమనం లభిస్తుంది. అంచనాలకు మించిన ఉద్యోగం లభిస్తుంది. కొందరు స్నేహితుల అండదండలతో పరిస్థితిలో మార్పు వస్తుంది. తల్లితండ్రులు, తోబుట్టువుల నుంచి కూడా ఆదరణ పెరిగి, జీవితం ఆశాజనకంగా మారుతుంది.
  3. సింహం: ఈ రాశికి శనీశ్వరుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల శశ మహా పురుష యోగం ఏర్పడింది. భాగ్య స్థానంలో గురు సంచారం కూడా ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉంది. అందువల్ల ఎటు వంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా ఈ ఏడాది అతి సమీప భవిష్యత్తులో బాగా కోలుకుని, తమ కాళ్ల మీద తాము నిలబడడం జరుగుతుంది. ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో తమ పరిస్థితులను మార్చుకోవడానికి అవకాశాలు ముందుకు వస్తాయి. ముందుగా ఆర్థికపరమైన ఆధారం దొరుకుతుంది.
  4. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఎటువంటి దుర్భర, దయనీయ పరిస్థితి నుంచయినా బయటపడడం జరుగుతుంది. ఆర్థికంగా ఆధారం దొరకడంతో పాటు ఉద్యోగం లభిం చడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధమైన వివాదం తొలగిపోయి, ఆర్థిక పురోగతికి అవకాశం ఏర్పడుతుంది. కొందరు బంధుమిత్రుల సహాయంతో క్రమంగా నిలదొక్కుకోవడం ప్రారంభం అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శని సంచారం వల్ల శశ మహా పురుష యోగం పట్టింది. అట్టడుగు పరిస్థితి నుంచి ఈ రాశివారు పైకి రావడం తప్పకుండా జరుగుతుంది. ఆస్తి వివాదాలు లేదా ఇతర వివాదాల్లో కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పుతుంది. కొద్దిగా ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి అన్ని విధా లుగానూ సహాయం అందుతుంది. ఆరోగ్యం చక్కబడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగం లభిస్తుంది.
  6. ధనుస్సు: ఈ రాశివారికి శనీశ్వరుడితో పాటు, గురువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది పాటి ప్రయత్నం చేసినా అత్యధికంగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా మెరుగుపడుతుంది. తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. అనారోగ్యానికి సంబం ధించిన సరైన వైద్యుడు కానీ, సరైన చికిత్స గానీ అందుబాటులోకి వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరిగి, వారి నుంచి సహాయం లభిస్తుంది.
  7. మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ధనాధిపతి శని సంచారం వల్ల తప్పకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. కొద్దికాలంలోనే ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఎటువంటి ‘అట్టడుగు’ స్థితిలో ఉన్నప్పటికీ ఇతరుల నుంచి చేయూత లభిస్తుంది.
  8. కుంభం: ఈ రాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి కూడా శశ మహా పురుష యోగం ఏర్పడింది. ఎటువంటి దుర్భర పరిస్థితుల నుంచయినా బయటపడడానికి ఇది దోహదం చేస్తుంది. సొంత ఊర్లోనే ఉద్యోగం రావడం, ఆర్థికంగా సంతృప్తికరమైన జీవితం ఏర్పడడం జరుగు తుంది. కొందరు మిత్రుల నుంచి అన్ని విధాలుగానూ సహాయం అందుతుంది. కొద్దిపాటి ప్రయ త్నంతో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.