September 2024 Horoscope
సెప్టెంబర్ నెలలో రవి, బుధ, శుక్ర గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. ఈ గ్రహాలు రాశులు మారడం వల్ల తప్పకుండా కొన్ని రాశుల వారికి అదృష్ట యోగాలు పడతాయి. రవి కన్యారాశి లోనూ, బుధుడు సింహ రాశిలోనూ, శుక్రుడు తులా రాశిలోనూ సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఈ రాశుల మార్పువల్ల మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు బాగా యోగదాయకంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనల్లా పూర్తయి, చాలావరకు సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- మేషం: ఈ రాశికి నాలుగు, అయిదు స్థానాలు శుభ గ్రహాలతో బాగా బలపడుతున్నందువల్ల లాభదాయక పరిచయాలు ఏర్పడి జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. ధనానికి లోటుండదు. అనేక మార్గాల్లో ధన ప్రవాహం ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అవకాశాలు బాగా పెరగడంతో పాటు లాబదాయక ఒప్పందాలు చోటు చేసు కుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
- వృషభం: ఈ రాశికి బుధ, రవి, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల వృక్తిగత, కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలావరకు తగ్గిపోయి, సంతోషకరమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనేక ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
- సింహం: ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ శుభ గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంతో పాటు సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- తుల: సెప్టెంబర్ నెలంతా లాభ స్థానం శుభ గ్రహాలతో పటిష్ఠంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు, జీతాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో బుధు, రవి, శుక్ర గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల కెరీర్ లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపా రాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. విదేశీయాన సూచనలున్నాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల తప్పకుండా పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మంచి కుటుంబం నుంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజ యవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవ కాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. సొంత ఇంటి కల నిజమయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి